English | Telugu

Brahmamudi : బిడ్డని కంటే ప్రాణానికే ప్రమాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -858 లో.....కావ్య టపాసులు కాల్చాలని రాహుల్, రుద్రాణి కలిసి టాక్సిక్ కెమికల్స్ కలిపిన టపాసులు తీసుకెళ్తారు. వాటిని రాజ్ తీసుకొని వచ్చిన టపాసులలో కలుపుతారు. ఆ టపాసులని అప్పు, కళ్యాణ్ ఇద్దరు తీసుకెళ్ళి కాలుస్తారు. కావ్య కదా అవి కాల్చాల్సినవి అనుకొని రాజ్ దగ్గరికి రుద్రాణి వచ్చి కావ్య దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి నీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నావ్ కదా.. మరి కావ్య దగ్గరికి వెళ్లి తీసుకొని వచ్చి తనతో సెలబ్రేట్ చేసుకోమని రుద్రాణి చెప్తుంది.

దాంతో కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి రమ్మని పిలుస్తాడు. మరొకవైపు అప్పు టపాసులు కాలుస్తూ ఆ పొగకి కళ్ళు తిరిగిపడిపోతుంది వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. తను చెక్ చేసి మీరు కాల్చే టపాసుల్లో టాక్సీక్ కెమికల్ ఎక్కువగా ఉంది.. అవి ఎవరు వాడకూడదని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అదేంటీ రాజ్ అవి నువ్వే తీసుకొని వచ్చావ్ కదా అని రుద్రాణి అంటుంది. ఇక అందరు కావ్య కోసం తీసుకొని వచ్చాడని అపార్ధం చేసుకొని రాజ్ ని తిడతారు.

నా బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నావని రాజ్ చొక్కా పట్టుకొని కావ్య నిలదీస్తుంది. ఎందుకంటే నువ్వు చస్తావని అని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఇది మరొక నాటకమా అని కావ్య అంటుంది. అప్పుడే అప్పు ఎంట్రీ ఇచ్చి బావ చెప్పింది నిజమని చెప్తుంది. నువ్వు బిడ్డని క్యారీ చేస్తే అది నీ ప్రాణానికి ప్రమాదమని అప్పు చెప్తుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ జరిగింది చెప్పడంతో కావ్య బాధతో బయటకు వెళ్లి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.