English | Telugu

Brahmamudi : భార్య ఇంటి ముందు ధర్నా చేస్తున్న భర్త.. తను అత్తగారింటికి వస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -853 లో..... రుద్రాణి ఫోన్ చేసి మహిళ సంఘాల వాళ్ళని పిలుస్తుంది. వాళ్ళు రాజ్ దగ్గరికి వచ్చి మీ భార్యని టార్చర్ పెడుతున్నారని తెలిసింది.. అందుకే పుట్టుంటికి వెళ్లిందట కదా అని రాజ్ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతారు. అప్పుడే కావ్య ఎంట్రీ ఇచ్చి.. నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదని చెప్తుంది.

భార్యాభర్త అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి.. మేం పరిష్కారించుకుంటామని కావ్య వాళ్ళని అక్కడ నుండి పంపించేస్తుంది. ఆయనకు నాకు గొడవలు ఉన్నాయి కానీ ఈ కుటుంబం నాది.. పరువుపోతుంటే నేనెలా చూస్తానని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్లాన్ ఫెయిల్ అయిందని రుద్రాణి డిస్సపాయింట్ అవుతుంది. మరొక ప్లాన్ వేస్తుంది. రాజ్ కావ్య వీడాకుల తీసుకునేలా రుద్రాణి ప్లాన్ చేసి రాహుల్ కి చెప్తుంది.

ఆ తర్వాత రాజ్ ఇవి విడాకుల పత్రాలు వీటిపై సంతకం చెయ్ అని బెదిరించు అప్పుడు కావ్య తప్పకుండా తిరిగి వస్తుందని రాజ్ కి రుద్రాణి సలహా ఇస్తుంది. దాంతో కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. నేను రానని కావ్య అనగానే.. అయితే ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాజ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కావ్య ఇంటికి రావాలని రాజ్ తన ఇంటి ముందు ధర్నా చేస్తాడు. కావ్య కూల్ గా కాఫీ తాగుతూ లోపలికి రండి అని పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.