English | Telugu

Brahmamudi : రాజ్ ని ఇబ్బంది పెడుతున్న..కావ్యకి అబార్షన్ తప్పదా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -832 లో..... రాజ్ డిస్సపాయింట్ గా ఇంటికి వస్తాడు. అప్పుడే రాజ్ ని ఆఫీస్ కి వెళ్ళమని సుభాష్ అంటాడు. నేను వెళ్ళనని సుభాష్ పైకి రాజ్ గట్టిగా అరుస్తాడు రాజ్. దాంతో సుభాష్ బాధపడుతాడు. రాజ్ ఇలా ఎందుకు చేస్తున్నాడని అందరు షాక్ అవుతారు.

రాజ్ లోపలికి వెళ్లి డాక్టర్ తో ఫోన్ మాట్లాడుతాడు. డాక్టర్ అబార్షన్ కాకుండా వేరొక ఛాన్స్ ఉంది కానీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే అని అతను చెప్తాడు. ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి కావ్య ఉంటుంది. అసలు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నారు. నాకు కళ్యాణ్ అంతా చెప్పాడు ఏదో ప్రాబ్లమ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాడు. ఏంటి అది అని కావ్య అడుగుతుంది. ఎన్నడు లేనిది మీ నాన్నని అన్ని మాటలు అన్నారు. అయన ఎంత బాధపడి ఉంటారని రాజ్ తో కావ్య అంటుంది.

ఆ తర్వాత సుభాష్, అపర్ణ మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ వచ్చి నన్ను క్షమించండి నాన్న అని కాళ్ల పై పడబోతుంటే వద్దని సుభాష్ అంటాడు. నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటని రాజ్ ని సుభాష్ అడుగుతాడు. అది ఇప్పుడు చెప్పలేనని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో వదినకి అబార్షన్ చేయించు వేరే దారి లేదని రాజ్ తో కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.