English | Telugu

Brahmamudi : కావ్యకి  దూరంగా రాజ్.... అతని ప్రయాణాన్ని ఆపగలదా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -803 లో......అక్క చెల్లెళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది చూసి అక్కచెల్లెళ్ళు అంత హ్యాపీగా ఉండడం ఏంటని రుద్రాణి అనుకుంటుంది. స్వరాజ్ దగ్గరికి వెళ్లి.. బాబూ నీకు ఆ ఆంటి చాక్లెట్ ఇచ్చింది కదా.. ఇప్పుడు తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కంగ్రాట్స్ చెప్పావా అని రుద్రాణి అనగానే.. ఓహ్ ఎందుకు చెప్పను చెప్తానంటూ కావ్య దగ్గరికి వెళ్తాడు. ఆంటి కంగ్రాట్స్ మీరు ప్రెగ్నెంట్ అంట కదా అని అనగానే అందరు షాక్ అవుతారు.

నీకెవరు చెప్పారని ఇందిరాదేవి అడుగుతుంది. వెంటనే స్వరాజ్ రుద్రాణి పేరు చెప్తాడు. నీకు కొంచెం అయినా బుద్ధి ఉందా చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ రుద్రాణిపై ఇందిరాదేవి విరుచుకుపడుతుంది. అటు తిప్పి ఇటు తిప్పి నన్ను అంటున్నారని రుద్రాణి అనుకొని.... నేను అప్పుని చూపించాను వాడికి కావ్య అని అర్థమైంది.. నేనేం చెయ్యాలని రుద్రాణి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు కలిసి కనకాన్ని బయటకు తీసుకొని వచ్చి పూజ తర్వాత కావ్యని రాజ్ ఆశీర్వాదించేలా ఏమైనా ప్లాన్ చేసావా అని అడుగుతారు. అదంతా నేను చూసుకుంటానని కనకం హామీ ఇస్తుంది. ఆ తర్వాత పూజ జరుగుతుంది. రాహుల్ దగ్గర స్వప్న ఆశీర్వాదం తీసుకోగా.. కళ్యాణ్ దగ్గర అప్పు ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుకి ఏంటి ఏం కావడం లేదు.. నువ్వు అసలు టాబ్లెట్ మార్చావా లేదా అని రాహుల్ ని అడుగుతుంది రుద్రాణి. మార్చాను మమ్మీ అని రాహుల్ చెప్తాడు.

ఆ తర్వాత కనకం దగ్గర కావ్య ఆశీర్వాదం తీసుకుంటుంది. పక్కనే రాజ్ ఉండడంతో తన చేతిలోని అక్షింతలు కావ్యపై పడేలా కనకం చేస్తుంది. రాజ్ ఆశీర్వాదించాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ పక్కకి తీసుకొని వెళ్లి తన మనసులో మాట చెప్తాడు. ఎందుకు మీరు నన్ను వద్దని అంటున్నారని అడుగుతాడు. తరువాయి భాగంలో రాజ్ అమెరికా వెళ్తున్నాడని రుద్రాణి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి.. థాంక్స్ కావ్య.. నీ వల్లే మా బావ అమెరికా వెళ్తున్నాడని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.