English | Telugu

Brahmamudi: పుట్టింటికి వచ్చేసిన కావ్య.. కారణం తెలుసుకొని కనకం షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -849 లో.... కావ్య తన పుట్టింటికి వస్తుంది. ఎందుకు ఇంత సడెన్ గా వచ్చావని కనకం ఆరా తియ్యడంతో కావ్య చిరాకుగా.. ఒక అమ్మాయి ఇలా పుట్టింటికి వచ్చే స్వేచ్ఛ కూడా లేదా అని అంటుంది. అసలు కావ్య వాళ్ళ అత్తింట్లో ఏం జరిగిందో కనుక్కుందామని అపర్ణకి కనకం ఫోన్ చేస్తుంటే.. కావ్య వచ్చి లాక్కొని ఎవరికి ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు.. ఆకలి అవుతుంది ముందు భోజనం పెట్టమని కావ్య అంటుంది.

మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్ళిందేమోనని కనకంకి అపర్ణ ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని అపర్ణ అనగానే.. ఇంకేముంది అసలు కావ్య అక్కడికి వెళ్లి ఉండదు.. వెళ్తే అసలు ఏమైందని ఆ కనకం ఫోన్ చేసేది కదా అని రుద్రాణి అంటుంది. మరొకవైపు అసలు అక్క ఎక్కడికి వెళ్ళిందని కావ్య ఫోటో పట్టుకొని అప్పు ఏడుస్తుంది.

ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటే రాజ్ తన దగ్గరికి వచ్చి ఇంటికి వెళదామని అడుగుతాడు. మీ నిర్ణయం మార్చుకోండి లేదా ఆ నిర్ణయానికి గల కారణం అయినా చెప్పండి అని కావ్య అంటుంది. వస్తే రా.. లేకపోతే లేదని రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. అసలేం జరిగిందని కనకం అడుగుతున్నా కూడా కావ్య సైలెంట్ గా ఉంటుంది. మరొకవైపు మీ అక్క మీ ఇంట్లోనే ఉందట అని అప్పుతో కళ్యాణ్ చెప్పగానే అప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. కావ్య గురించి ఏమైనా తెలిసిందా అని అపర్ణ అడుగుతుంది. వాళ్ళింట్లో ఉంది రమ్మంటే రానంది అని రాజ్ చెప్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. నా కోడలు నా ఇంట్లో ఉండాలని అపర్ణ అంటుంది. రానంటుంది నేనేం చెయ్యాలని చెప్పి రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్నకి కనకం ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది.

తరువాయి భాగంలో కావ్య దగ్గరికి ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. నీ యాక్టింగ్ సూపర్ అంటారు. యాక్టింగ్ కాదు నేను నిజంగానే ఇంట్లో నుండి వచ్చేసానని కావ్య అనగానే అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. అసలు ఏమైందని కనకం అడుగుతుంది. కావ్యని రాజ్ అబార్షన్ చేసుకొమ్మంటున్నాడని అపర్ణ చెప్పగానే కనకం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.