English | Telugu

Brahmamudi : ఇంట్లో కాళీగా భర్త.. ఆఫీస్ లో బిజీగా భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారకమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -549 లో.. అనామిక మనిషిని జాబ్ నుండి తీసేసీ సెక్యూరిటీ పోస్ట్ ఇస్తుంది కావ్య. ఇలా ఎవరైనా ఆఫీస్ కి ద్రోహం చెయ్యాలని చూస్తే ఇలా సెక్యూరిటీ జాబ్ కాదు.. ఇక పోలీస్ స్టేషనే అని కావ్య ఎంప్లాయిస్ కి వార్నింగ్ ఇస్తుంది. మేడమ్ మీకు పెళ్లి అయి ఎన్ని రోజులు అవుతుంది. ఆరు నెలలు అవుతుందా అని శృతి కావ్యని ఆడుతుంది. నీకు తెలియదా.. ఆరు నెలలు మూడు సార్లు అయింది.. ఎందుకు అడిగావని కావ్య అనగానే.. ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట మీరు రాజ్ సర్ లాగే చేస్తున్నారని శృతి అంటుంది.

రాజ్ ఆఫీస్ కి వెళ్తున్నాడో లేదో అని అపర్ణ, ఇందిరాదేవిలు డిస్కషన్ చేసుకుంటుంటే.. ఏంటి అత్త కోడళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్నారని రుద్రాణి అంటుంది. దాంతో నీ భర్త ఎక్కడున్నాడో వెతకమని చెప్పాము. తెలిస్తే నీ దరిద్రం మాకు వదిలిపోతుంది కదా అని ఇందిరాదేవి అనగానే.. వద్దు నేను ఎక్కడికి వెళ్ళనని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ టీ షర్ట్ లుంగీ కట్టుకొని కిందకి వస్తాడు. అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. కాలిగా ఉన్నా అని సింబాలీక్ గా ఇలా వేసుకున్నానని రాజ్ అంటాడు. అపుడే కావ్య ఫోన్ చేస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్లకుంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉంటాయ్.. రమ్మని బ్రతిమిలాడడానికి కాల్ చేస్తుంది.. మీ అప్పలమ్మ అని రాజ్ వాళ్ళతో అంటాడు. రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయా అని అంటాడు. లేదు ఇప్పడే ఫాస్ట్ గా అవుతున్నాయని కావ్య అంటుంది. మరెందుకు కాల్ చేసావని రాజ్ అడుగుతాడు. లాప్ టాప్ పాస్ వర్డ్ చెప్పండి అని కావ్య అడుగుతుంది. చెప్పను.. నువ్వు సీఈఓ అయ్యావ్ కదా కనిపెట్టమని రాజ్ అంటాడు.

మరొక వైపు కళ్యాణ్ రైటర్ దగ్గరికి వెళ్తాడు. తనకి అవకాశం ఇవ్వమని అడుగుతాడు. దాంతో అతను కళ్యాణ్ ని అవమానిస్తాడు. కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కిచెన్ లోకి వెళ్లి అపర్ణ, శాంతలని డిస్టర్బ్ చేస్తుంటాడు. హాల్లో కూర్చొని పని మనిషికి అది తీసుకొని రా.. ఇది తీసుకొని రా అంటూ పని చెప్తాడు.‌ రాజ్ ని కాళీగా ఉన్నావంటూ అందరు ఏదో ఒకరకంగా ఎగతాళిగా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.