English | Telugu

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ లోడింగ్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే టాప్ 5 ఫైన‌ల్ కాబోతోంది. అంతే కాకుండా మ‌రో మూడు వారాల్లో ఓటీటీ సీజ‌న్ కి ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోంది. ప్ర‌స్తుతం హౌస్ లో వున్న 9 మంది కంటెస్టెంట్ ల‌లో బిందు మావి టైటిల్ రేస్ లో దూసుకుపోతోంది. అఖిల్ సీజ‌న్ 4 లో ర‌న్న‌ర్ గా మిగిలిన‌ట్టే ఈ ఓటీటీ వెర్ష‌న్ లోనూ వెన‌క‌బ‌డే వున్నాడు. ఈ సారి కూడా త‌ను విజేత కాలేడ‌న్న‌ది తేలిపోయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ ని ప్ర‌క‌టించ‌కుండానే సీజ‌న్ 6 కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే కంటెస్టెంట్ ల వేట కూడా మొద‌లైన‌ట్టుగా చెబుతున్నారు.

అంతే కాకుండా దాదాపుగా కంటెస్టెంట్స్ ని కూడా సైలెంట్ గా ఫైన‌ల్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలే వేదిక‌గా నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేశారో అదే విధంగా ఈ నాన్ స్టాప్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే వేదిక‌గా సీజ‌న్ 6 ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. సీజ‌న్ 6 ఎప్పుడు ప్రారంభించ‌బోతున్నార‌నే విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జున వెల్ల‌డించనున్నార‌ట‌. ఇక సీజ‌న్ 6 కి కూడా నాగార్జ‌న‌నే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ట‌. ఇంత‌కీ సీజ‌న్ 6 కంటెస్టెంట్స్ గా ఎవ‌రు రాబోతున్నార‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిగా మారింది.

బ‌గ్ బాస్ నాన్ స్టాప్ లో ఇప్ప‌టికే బెస్ట్ పెర్ఫార్మార్ గా పేరు తెచ్చుకున్న యాంక‌ర్ శివ సీజ‌న్ 6 లోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ట‌. ఇక అఖిల్, అషురెడ్డి, బాబా భాస్క‌ర్ ఇప్ప‌టికే బిగ్ బాస్ లోకి వ‌చ్చి వెళ్లారు కాబ‌ట్టి వారికి ఛాన్స్ లేదు. అయితే ఇక మిగిలిన కంటెస్టెంట్ లు ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సుమ‌న్ టీవి యాంక‌ర్లు రోష‌న్, మంజూష ఫిక్స్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు చాలా మంది యూట్యూబ్ స్టార్లు, యాంక‌ర్ల పేర్లు ప్ర‌చారంలో వున్నాయి. అంతే కాకుండా ఈ సీజ‌న్ లో ఓ కామ‌న్ మెన్ కి కూడా అవ‌కాశం ఇవ్వ‌బోతున్నార‌ని తెలిసింది. ఆ కామ‌న్ మెన్ ఎవ‌రుంటారో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.