English | Telugu

ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌తో సిరి ఎంట్రీ.. మ‌ళ్లీ అవే ముచ్చ‌ట్లు

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎండింగ్ కి ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రో మూడు వారాలే వుండ‌టంతో టాప్ 5 లో ఎవ‌రుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ఇప్పుడు కీల‌కంగా మారింది. టాప్ 5కి డైరెక్ట్ గా నామినేట్ అయ్యే అవ‌కాశాన్ని ఈ పాస్ క‌ల్పిస్తుంది. అయితే ఈ పాస్ ని అందించ‌డానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ సిరి హ‌న్మంత్‌. బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరి హ‌న్మంత్ -ష‌ణ్ముఖ్ చేసిన ర‌చ్చ‌ అంతా ఇంతా కాదు. మోజ్ రూంలో ముచ్చ‌ట్లు.. అల‌క‌లు.. ఏడుపులు.. బెడ్ రూం విన్యాసాలు.. హ‌గ్గులు, కిస్సులు.. దీంతో వీరి ఇమేజ్ డ్యామేజ్ కావ‌డం.. ష‌ణ్ముఖ్ కు ఏకంగా టైటిల్ మిస్స‌వ‌డం తెలిసిందే.

అయితే టాప్ 5 కంటెస్టెంట్ కి బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ ని డిసైడ్ చేసే బాధ్య‌త‌ను అప్ప‌గించింది బిగ్ బాస్ టీమ్. బిగ్‌బాస్ నాన్ స్టాప్ చివ‌రి అంకానికి చేర‌డంతో కీల‌క‌మైన ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ని కంటెస్టెంట్ కి అందించ‌డానికి హౌస్ లోకి అడుగుపెట్టింది సిరి. ఇంటి స‌భ్యుల‌తో పాత ముచ్చ‌ట్లు చెప్పుకుంటూ వ‌చ్చింది. అయితే ఈ ముచ్చ‌ట్లలో ష‌ణ్ముఖ్ టాపిక్ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అంతా ఊహించారు. అనుకున్న‌ట్టే ష‌ణ్ముఖ్ ముచ్చ‌ట్లు చెప్ప‌డం మొద‌లు పెట్టింది సిరి. ష‌న్ను, త‌ను క‌లిసి వున్న మోజ్ రూం, బెడ్ రూం ల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని మ‌రోసారి గుర్తు చేసుకుంది.

మోజ్ రూం కి వెళ్లి ష‌న్ను, జెస్సీల‌తో తాను ఇక్క‌డే వుండేదాన్న‌ని చెప్పుకొచ్చింది. బెడ్ గురించి జెబుతుంటే న‌ట‌రాజ్ మాస్ట‌ర్ దీనిపై మీ ఇద్ద‌రితో పాటు ఇంకొక‌రు కూడా వుండేవారే అంటూ సెటైర్ వేశాడు. అది గ‌మ‌నించిన సిరి `అవును ముగ్గురం వుండే వాళ్లం. నేను చెప్ప‌క‌పోయినా మీరు ఆగ‌రు క‌దా? అంటూ పంచ్ వేసింది. ఇక చివ‌ర్లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, బాబా భాష్క‌ర్ ల మ‌ధ్య కుకింగ్ విష‌యంలో గొడ‌వ జరిగింది. స‌హ‌నం కోల్పోయిన బాబా భాస్క‌ర్ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు షాకిచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.