English | Telugu

Bigboss 8 episode review : బిగ్ బాస్ సీజన్-8 రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ఆసక్తికరంగా సాగుతుంది. వారం నుండి మెగా చీఫ్ కోసం హౌస్ లో పోటీ జరుగుతుంది. అందులో భాగంగానే విష్ణుప్రియ, యష్మీకి ఒక టాస్క్ జరిగింది. అది స్క్రూలు తిప్పి పజిల్ సెట్ చెయ్యాలి. ఇక మన నత్తి బ్రెయిన్ విష్ణు గురించి తెలిసిందే కదా.. చెత్త ఆటతీరును కొనసాగించింది. యష్మీ కాస్త స్మార్ట్ గా థింక్ చేసి హౌస్ మేట్స్ సపోర్ట్ తో ఆ టాస్క్ విన్ అయింది. ఇక ఆ తర్వాత ఆరెంజ్ కలర్ సూట్ కేసు ఓపెన్ చేయమని బిగ్ బాస్ యష్మీ కి చెప్తాడు.

యష్మీ సూట్ కేసు ఓపెన్ చేసేసరికి అందులో డెబ్భై అయిదు వేలు ఉంటాయి‌ అవి ప్రైజ్ మనీ కి ఆడ్ చెయ్యాలి. తీరా చూస్తే యష్మీ ఓపెన్ చేసింది విష్ణుప్రియ సూట్ కేస్. యష్మీ సూట్ కేసు లో లక్ష ఏనబై వేలు ఉంటాయి. దాంతో అందరూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తారు. కానీ అమౌంట్ డెబ్భై అయిదు వేయిలు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతాయి. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే హరితేజ, విష్ణుప్రియ కిచెన్ లో ఉంటారు. ఏం చేస్తున్నారు అంది అని గాసిప్ క్వీన్ అలిగితే నత్తి బ్రెయిన్ విష్ణు వెళ్లి బుజ్జగించింది.. ఇక కామెడీ అడిషన్స్ టాస్క్ లో రోహిణి, అవినాష్ ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు.

టాస్క్ తర్వాత విష్ణుని పృథ్వీ ఏమో అన్నాడని.. విష్ణు హర్ట్ అయింది. వాళ్ళకి పంచాయతీ చెప్పడానికి యష్మీ ట్రై చేసింది కానీ కాసేపటికి విష్ణు వెళ్ళి అడిగి మరి పృథ్వీతో సారి చెప్పించుకుంది. ఆ తర్వాత టాస్క్ లో మంతనాలు ఎప్పటిలాగే ఇంకా ఏదో సాధించాలని యష్మీ ఆరాటం.. ఇక రేపటితో మెగా ఛీఫ్ ఎవరు అవుతారో తెలుస్తుంది. ఈ వారం మెగా ఛీఫ్ ఎవరు అవుతారో చూడాలి మరి!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.