అనిల్ కపూర్, సునీత ప్రగాఢ ప్రేమగాథ గురించి మీకు తెలీని నిజాలు!
ఆ ఇద్దరి లవ్ స్టోరీ మీడియా దృష్టిని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు గాక, కానీ సినిమా లవ్ స్టోరీకి వారి కథ ఏ మాత్రం తక్కువ కాదు. ఆ ఇద్దరు.. అనిల్ కపూర్, ఆయన భార్య సునీత! వాళ్లది అసాధారణ ప్రేమగాథ. ఇవాళ ఆ జంట ముగ్గురు అందమైన పిల్లలను (సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్థన్ కపూర్) చూసుకొని గర్వపడే తల్లిదండ్రులు. ఇండస్ట్రీలోని తొలినాళ్లలో పగలు పనికోసం చూసేవాడు అనిల్.