రాజశేఖర్ సినిమాకి 70 కోట్ల బడ్జెట్..!
ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ పోషించి యాంగ్రీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర్.. మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే కొంతకాలంగా వెనకపడిపోయారనే చెప్పాలి. ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు మంచి వసూళ్లు రాబడుతూ స్టార్లుగా కొనసాగుతున్నారు. అలాగే జగపతి బాబు, శ్రీకాంత్ వంటి హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రాజశేఖర్ మాత్రం హీరోగా మంచి వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయారు.