Read more!

English | Telugu

గీతాంజలి మళ్ళీ వచ్చింది కలెక్షన్స్ ఇంతే

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో 2014 లో వచ్చిన హర్రర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్  గీతాంజలి. అప్పట్లో ప్రేక్షకుల్లో నవ్వుని, భయాన్ని ఏకకాలంలో తీసుకొచ్చి మంచి విజయాన్నే సాధించింది. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రమే  గీతాంజలి మళ్ళీ వచ్చింది ( Geethanjali malli vachindi)మొన్న ఏప్రిల్ 11 న వరల్డ్ వైడ్ గా విడుదలయ్యింది. రీసెంట్ గా వస్తున్న న్యూస్ తో టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. 

 గీతాంజలి మళ్ళీ వచ్చింది  తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మూవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రోజు రోజుకి కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకు నిదర్శనంగా కేవలం 11 రోజుల్లో 20 కోట్ల రూపాయల వసూళ్ళని రాబట్టింది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో ఇదీ పెద్ద విజయం అని చెప్పవచ్చు. అంజలి తో పాటు శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య శకలక శంకర్,బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు  కీలక పాత్రల్లో నటించారు. 

ఎంవీవీ సినిమా మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లపై ఎంవీవీ సత్య నారాయణ,కోన వెంకట్ (kona venkat)లు నిర్మించారు..అలాగే ఈ మూవీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కథ,స్క్రీన్ ప్లే ని కోన వెంకట్ నే అందించారు. గతంలో రెడీ,దూకుడు,వెంకీ ఢీ, బ్రుస్ లీ, నిన్ను కోరి లాంటి సినిమాలు ఈయన రచనలోనే వచ్చాయి. ఇక గీతాంజలి మళ్ళీ వచ్చిందికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు.