Read more!

English | Telugu

తిరుపతి కొండ మీద హీరో ప్రేమ పెళ్లి

ఒక మంచి లవ్ మూవీకి వెళ్ళాం. హీరో ఏం చేస్తాడు. తన ప్రేమని  గెలిపించుకోవడానికి నానా పాట్లు పడతాడు. అవసరమైతే శత్రువులతో చిన్నపాటి యుద్ధం కూడా చేస్తాడు. నిజజీవితంలో జరిగే ప్రేమ పెళ్లిళ్లు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి.అసలు  ప్రేమ పెళ్లి ప్రశాంతంగా  జరగాలంటే పెట్టి పుట్టాలనే నానుడి కూడా ఉంది. తాజాగా  ప్రముఖ హీరో తిరువీర్ దాన్ని నిజం చేసాడు.
 
రీసెంట్ గా  తిరువీర్ (thiruveer)ఒక ఇంటి వాడయ్యాడు.  ఎప్పటినుంచో ప్రేమిస్తున్న కల్పనా రావు (kalpana rao)అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసాడు. నిన్న తిరుమల తిరుపతి దేవ స్థానంలో ఆ ఇద్దరి వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ మేరకు పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. కొత్త  జీవితం ప్రారంభం అనే క్యాప్షన్ ని కూడా  యాడ్ చేసాడు. ప్రస్తుతం ఆ పిక్స్  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.పలువురు నూతన జంటకి శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే ప్రేమని గెలుచుకున్నందుకు తిరువీర్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. 


 

 2016 లో వచ్చిన బొమ్మల రామారంతో తిరువీర్  వెండి తెరకు పరిచయమయ్యాడు. జార్జి రెడ్డి, పలాస, మల్లేశం లాంటి సినిమాలతో  మంచి నటుడు అనే గుర్తింపుని పొందాడు. 2022 లో వచ్చిన మసూధ (masooda) తో  సోలో హీరోగా మారాడు. ఆ మూవీ విజయంతో బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. త్వరలో  మోక్ష పట్నం, పారాహుషార్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి ఆయన స్వస్థలం.