English | Telugu

అల్లు అర్జున్ వీడియో రిలీజ్..పాతిక లక్షలు,వైద్యం,కుటుంబ బాధ్యత నాదే 

పుష్ప 2 బెనిఫిట్ షో సంధర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేణుక అనే మహిళ మృతి చెందగా,ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు.      ఇక ఇప్పుడు ఈ విషయం మీద అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో అయన మాట్లాడుతూ సంధ్య థియేటర్ కి మూవీ చూసేందుకు వెళ్లాను.సినిమా చూసి వచ్చిన తరువాత రేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె, బాబుకి సీరియస్ అని తెలిసింది.ఈ సంఘటనతో నేను, సుకుమార్,  మా టీమ్ మొత్తం చాలా బాధ పడ్డాం.రేవతి గారి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను.