Read more!

English | Telugu

లోకేష్ కోసం 'కూలీ'గా మారిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ కెరీర్ లో 171వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

రజినీకాంత్, లోకేష్ కాంబోలో రూపొందుతోన్న సినిమాకి 'కూలీ' అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ టైటిల్ ని రివీల్ చేస్తూ విడుదల చేసిన టీజర్ ఓ రేంజ్ లో ఉంది. గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ తో తలపడుతూ రజినీకాంత్ పాత్రను పరిచయం చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ వీడియోలో గోల్డ్ కలర్ ని హైలైట్ చేసి చూపించిన తీరు లోకేష్ మార్క్ ని చూపించింది. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్, లోకేష్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో.. మూడు నిమిషాల వీడియోలోనే చూపించారు. ఇక సినిమా వస్తే థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు అనడంలో సందేహం లేదు.

'కూలీ' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.