Read more!

English | Telugu

రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఇంతే.. లేటు అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది

చిరంజీవి నట వారసుడుగా సినీ సీమలోకి  అడుగుపెట్టి తండ్రి ఇమేజ్ కే సవాలు విసురుతున్న నటుడు రామ్ చరణ్ (ram charan)మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగి నేడు ఇండియాలోనే టాప్ స్టార్స్ లో ఒకడిగా  వెలుగొందుతున్నాడు. ఆర్ఆర్ఆర్ .మూవీ నుంచి చరణ్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.తాజాగా మరో వార్త  సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది.

చరణ్  అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ (game changer) ఆల్ ఓవర్ ఇండియా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. దీంతో చాలా మంది ప్రతి రోజు కూడా  సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చెర్రీ కి సంబంధించిన  ఒక వార్త ఇప్పుడు  వైరల్ గా మారింది. 120 కోట్ల భారీ  రెమ్యునరేషన్ ని గేమ్ చేంజర్ కోసం  తీసుకుంటున్నాడనే మాటలు వినపడుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గాని చరణ్ రెమ్యునరేషన్ వార్త అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  

 

ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ (shankar) కలల  ప్రాజెక్ట్ అయిన గేమ్ చేంజర్ ని దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. బహుశా దిల్ రాజు కెరీర్ లోనే ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పవచ్చు.  కియారా అద్వానీ చెర్రీ కి జోడిగా నటిస్తుంది. ఇటీవల  చెర్రీ  పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన జరగండి సాంగ్ యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తుంది. పొలిటికల్ నేపథ్యంలో మూవీ  తెరకెక్కుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అందరిలో ప్రత్యేక ఆసక్తి ఉంది. మైటీ స్టార్  శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో అవాంతరాలని ఎదుర్కొని ప్రెజంట్ శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.