కార్ కాకుండా ట్రక్ కొన్నావా... అంటున్న నెటిజన్స్
గత ఏడాది వరసపెట్టి కార్లు, టూర్లు, పెళ్లిళ్లు, పేరంటాలు, సీమంతాలు, పిల్లలు, గృహప్రవేశాలు వగైరా రకరకాల సెలెబ్రేషన్స్ తో బుల్లితెర సెలబ్రిటీస్ అంతా హంగామాగా ఉన్నారు. ఈ ఏడాది మాత్రం ఆ హడావిడి కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. ఐతే ఇల్లాంటి డల్ టైంలో దీప్తి సునైనా ఒక కార్ కొనేసి రచ్చ చేసింది. దీప్తి కొన్న ఈ కారు టయోటా హై లక్స్ . అయితే ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చునే అవకాశం ఉంది.