Read more!

English | Telugu

సుధీర్ హాలీవుడ్ లో ఉండాల్సిన వాడు..సర్కార్ లో ఉన్నాడేంటి


సర్కార్ సీజన్ 4  నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి హీరో సుహాస్ ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే హోస్ట్ సుధీర్ ని తెగ పొగిడేసాడు. "మీకొకటి చెప్పాలండి. మీ అందం మామూలు అందం కాదండి. మన్మధుడు మీ మేనమామా సర్ ..అంటే మేనమామ పోలికలు వస్తుంటాయి కదా" అని క్యూట్ బిస్కెట్ ఒకటి వేసేసరికి "మావయ్యా" అంటూ సుహాస్ ని సుధీర్ హగ్ చేసేసుకున్నాడు.

"మీరు హాలీవుడ్ లో మాత్రమే ఉండాలి" అని సుహాస్ మరో డైలాగ్ వేసేసరికి "అయ్యో టైంకి పక్కన ఎవరూ లేరే" అని సుధీర్ తెగ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. తర్వాత ప్రసన్నం వదనం మూవీ టీమ్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో డైరెక్టర్ అర్జున్, పాయల్ రాధాకృష్ణ, రాశి వచ్చారు. దాంతో "సర్ వినండి మాములుగా ఉండదు" అని అర్జున్ కి చెప్పాడు. "మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుధీర్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు" అంటూ సుహాస్ మరో క్రీం బిస్కెట్ వేసాడు. దానికి అర్జున్ "అంటే అందంగా పుట్టడం నేను చేసిన తప్పా..." అని అడిగేసరికి "ఫేస్ బ్లైండ్ నెస్ అని ఒక డిజార్డర్ ఉంది...అది ఉంటే ముఖాలు గుర్తుపట్టడమే కష్టం. అందుకే మీరు అందంగా కనపడుతున్నారు." అని సుహాస్ డిజార్డర్ గురించి అర్జున్ క్లారిటీగా చెప్పేసరికి సుధీర్ షాకయ్యాడు. అసలే సమ్మర్ సీజన్ కాబట్టి ఈ మూవీ టీమ్ మొత్తానికి బంగిన పల్లి మామిడి పండు ముక్కల్ని తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు కూడా తిని ఫుల్ గా  ఎంజాయ్ చేశారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక రాశి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. తన ఫస్ట్ లవ్ లో అసలేమీ జరగలేదు అని చెప్పేసరికి సుహాస్ పడీపడీ నవ్వేసాడు. ఐతే సుహాస్ డిజార్డర్ ని ఈ ఎపిసోడ్ లో బాగా ఎలివేట్ చేశారు డైలాగ్స్ తో.