Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : మాణిక్యానికి షాకిచ్చిన సీతాకాంత్.. శోభనం జరగలేదని కూపీలాగుతున్న శ్రీలత!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -79 లో.... సీతాకాంత్ వాళ్ళ ఆఫీస్ లో మాణిక్యం జాబ్ చేయడానికి వస్తాడు. జాబ్ లో జాయిన్ అవ్వడానికి సూట్ లో హుందాగా బాషా రేంజ్ లో వస్తాడు. జనరల్ మేనేజర్ పోస్ట్ అంటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతు మాణిక్యం వస్తుంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయితో.. నేను జనరల్ మేనేజర్ ని, అంతేకాకుండా మీ చైర్మన్ నాకు అల్లుడు, నా కొడుకుకి తన చెల్లిని ఇచ్చారంటూ బిల్డప్ ఇస్తుంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి మాణిక్యం వెళ్తాడు. నీ కోసమే వెయిట్ చేస్తున్నానని సీతాకాంత్ అనగానే.. ఎప్పుడు ఎప్పుడు జాబ్ లో జాయిన్ అవ్వాలని వెయిటింగ్ ఇక్కడ అని మాణిక్యం ముచ్చటపడుతుంటాడు. మాణిక్యం జనరల్ మేనేజర్ అంటే చెక్కులపై సంతకం చెయ్యడం అంతే కదా అని మాణిక్యం అంటాడు. ముందు నువ్వు దీనిపై సంతకం చెయ్ అని మాణిక్యంతో సీతాకాంత్ సంతకం చేయించుంటాడు. జనరల్ మేనేజర్ అంటే టీలు, ఫైల్ లు అందివ్వడమని సీతాకాంత్ అనగానే.. మాణిక్యానికి దిమ్మతిరిగిపోతుంది. నేను చెయ్యనని మాణిక్యం అంటాడు. అయితే రెండు సంవత్సరాల అగ్రిమెంట్ పై సంతకం చేసావ్.. లేదంటే రెండు లక్షలు ఇవ్వాలని సీతాకాంత్ అనగానే వేరే గతిలేక ఇక సూట్ తీసేసి.. ఫ్యూన్ డ్రెస్ వేసుకొని సీతాకాంత్ కి కాఫీ తీసుకొని వస్తాడు మాణిక్యం‌ మరొకవైపు సీతాకాంత్ ఇచ్చిన డబ్బులతో అభి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు.. ఆ తర్వాత రామలక్ష్మి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలని దేవుడి కి మొక్కుకుంటుంది.

ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సిరి వచ్చి.. మీరు మా కోసం మాత్రమే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని మాట్లాడుతుంది. కాసేపటికి రామలక్ష్మిని శ్రీలత హాల్లో కూర్చొ పెట్టి.. ప్రతీ తల్లి ఇలా కూతురితో మాట్లాడుతుంది. అందుకే నేను అత్తలా కాకుండా అమ్మలాగా అడుగుతున్నాను.. నిన్న మొదటిరాత్రి జరగలేదు కదా అని అడుగుతుంది. నీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాతో చెప్పుకోమని శ్రీలత అంటుంది. కానీ రామలక్ష్మి జరిగిందని చెప్తుంది‌ . శ్రీలత అడిగేసరికి రామలక్ష్మి నిజం చెప్పాలనుకుంటుంది.. కానీ మళ్ళీ చెప్పదు.  కాసేపటికి మొన్న ఒక అబ్బాయి నీతో మాట్లాడాడు కదా.. ఎవరని రామలక్ష్మిని శ్రీలత అడుగుతుంది.. దాంతో తెలిసిన అబ్బాయని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఏదో చెప్పాలని ట్రై చేసి ఆగిపోయిందని శ్రీలత అనుకుంటుంది. ఇక అభి గురించి శ్రీలత అడిగిందని సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది.. మనం ఆడుతున్న నాటకం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ అవుతుంది. నేనెంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే అంత మంచిదని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.