Read more!

English | Telugu

Karthika Deepam2 :  కార్తిక్ ఫైర్.‌. దీప తల్లిని అని చెప్పిన సుమిత్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -26 లో.. దీప గురించి తెలుసుకోవాలని, తను వంట చేస్తుంటే హెల్ప్ చెయ్యాలని సుమిత్ర తన దగ్గరకి వెళ్ళి మాటకలుపుతుంది. నీ గురించి చెప్పు అంటు దీపని సుమిత్ర అడుగుతుంది. ఈ వంటలు ఎవరు నేర్పారని సుమిత్ర అడుగుతుంది. మా నాన్న వంట మాస్టర్ అని అనగానే.. అందుకేనా ఇలా వంటలు చేస్తున్నావని సుమిత్ర అంటుంది. మీరు కూడా నాకు మొదటిసారి భోజనం పెడుతుంటే.. పరిచయం అయ్యారని దీప అంటుంది.. ఆ తర్వాత నీకు, నాకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుందని సుమిత్ర అంటుంది.

కాసేపటికి శౌర్య వాళ్ళ నాన్నేం చేస్తాడని సుమిత్ర అడుగుతుంది. దానికి దీప మాటదాటవేస్తుంది.. ఆ విషయం సుమిత్రకి అర్థం అవుతుంది. మీ భర్త ఎక్కడ ఉంటాడని సుమిత్ర మళ్ళీ అనగానే.. దీప మళ్ళీ డైవర్ట్ చేస్తుంది. ఆ తర్వాత నీ భర్త గురించి చెప్తేనే కదా నేను సాయం చేసేదని సుమిత్ర అనుకుంటుంది. మరోవైపు నువ్వు చేస్తుంది బాలేదని పారిజాతంపై కార్తిక్ కోప్పడతడు. ఏదో బర్త్ డే అని హ్యాపీ గా ఫీల్ అవుతుందని చేసానని పారిజాతం అనగానే.. రోజ్ ఇస్తే హ్యాపీగా ఉంటుందని ఇచ్చావ్ రేపు పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటుందని చేస్తావా.. మీరు ఎన్ని అనుకున్నా జ్యోత్స్న నా జీవితంలోకి రాదు.. ఈ విషయం మా అమ్మవాళ్ళకి చెప్తే బాధపడుతారని చెప్పట్లేదని కార్తీక్ అంటాడు. మీరు అందరు ఎలాగో జ్యోత్స్న కూడా అలాగే అని కార్తీక్ అంటాడు. మీరు అందరు చిన్నప్పుటి నుండి దాని మైండ్ పాడు చేశారని కార్తీక్ అంటాడు. నువు చెప్తావా నన్ను చెప్పమ్మంటావా అని కార్తీక్ అనగానే.. వీలు చూసుకొని సుమిత్రకి చెప్తానని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత దీప చేసిన వంటలకి మెచ్చుకుంటు.. తనని రెస్టారెంట్ కి చెఫ్ గా పెట్టుకోమని కార్తీక్ కి దశరథ్ చెప్తాడు. దానికి దీప వద్దని అంటుంది. ఆ తర్వాత శౌర్య బయపడుతూ లోపలికి వస్తుంది. ఏమైందని దీప అడుగుతుంది. బయటకు వెళ్లి చూసేసరికి.. అక్కడ నర్సింహ ఉంటాడు. దీపతో నర్సింహ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. రావే అంటూ చెయ్ పట్టుకొని లాక్కొని వెళ్తుంటే.. సుమిత్ర వచ్చి నర్సింహని కొడుతుంది. ఎవడ్రా నువ్వు అని సుమిత్ర అడుగుతుంది.. దాని భర్తని అని నర్సింహ చెప్తాడు. దీప ఎక్కడికి రాదని సుమిత్ర అంటుంది. నా పెళ్ళాన్ని తీసుకొని వెళ్తుంటే ఎందుకు వద్దు అంటున్నారని నర్సింహ అంటాడు. నీ మాటలు వింటేనే తెలుస్తుంది ఎంత మంచి మొగుడివో అని సుమిత్ర అంటుంది. అయినా వద్దని చెప్పడానికి నువ్వు ఎవరు అని నర్సింహ అనగానే.. దీప తల్లిని అని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.