Read more!

English | Telugu

సుమ ఆంటీ అవసరమా పాలిటిక్స్... గ్లాసు, స్టఫ్ మేమే ఇస్తాం!


ఇక ఏపీ, తెలంగాణాలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సమ్మర్ హీట్ తో పాటు పొలిటికల్ హీట్ కూడా తెగ పెరిగిపోతోంది. ఇక ఈ టాపిక్ ని బుల్లితెర కూడా బాగా వాడేస్తోంది. సుమ అడ్డా షోలో ఈ వారం "ప్రసన్న వదనం" మూవీ టీమ్ నుంచి కమెడియన్ భద్రం వచ్చాడు. ఇక సుమ ఆయనకు ఒక  టాస్క్ ఇచ్చింది. "భద్రంగారు ఎన్నికల్లో నిలబడితే ఎలాంటి హామీలు ఇస్తారు" అని అడిగింది.

వెంటనే భద్రం రెండు చేతులు ఎత్తి అటు ఇటు ఊపుతూ ఉండేసరికి "మీరంతా నాశనం అయ్యేలా చేస్తాను అంటున్నాడా..ఏంటండీ" అని అడిగింది సుమ. "ఇందాకే సుమ గారు చెప్పిన్నట్టు పుల్లైసు ఇచ్చి మనమంతా చల్లగా ఉండాలని కోరుకున్నారు. మన నియోజకవర్గ సభ్యులంతా కూడా చల్లగా ఉండాలని మన ఊరిలో మంచు కొండ ఒకటి ప్లాన్ చేద్దామనుకుంటున్నా...మందు బాబులు ఉన్నారిక్కడ..మీరు మందు కొనుక్కోండి..గ్లాసు, స్టఫ్ మేమే ఇస్తాం. ఏ ఇంట్లో చూసినా లేడీస్ ఎంతో కష్టపడుతున్నారు రీల్స్ చేస్తూ. మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దమ్మ..లైక్స్, కామెంట్స్ కూడా మేమే ఇస్తాం.." అని ఎన్నికల హామీలు ఇచ్చేసరికి సుమ భద్రం కళ్ళకు దండం పెట్టేసుకుని "నిజంగా గ్రేట్ సర్ మీరసలు, అంటే ఆ మంచు కొండను ఎప్పుడు తీసుకొస్తారు" అని అడిగింది. "ఒక్కసారి గెలిపించిన వెంటనే మంచుకొండను తీసుకొస్తాం" అని చెప్పాడు భద్రం. "ఆ మంచు కొండ తెచ్చే దారిలోనే కరిగిపోతే" అని మూవీ హీరోయిన్ శరణ్య అడిగింది. "మంచు కొండ కరగకుండా ఏదో ఒకటి చేద్దాం" అని చెప్పాడు. ఇక పాలిటిక్స్ సెగ్మెంట్ ఇచ్చేసరికి సుమ మీద ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.. "హలో సుమ ఆంటీ  అవసరమా నీకు పాలిటిక్స్ గురించి, ఓవర్ యాక్షన్ చేస్తున్నావా " అని కామెంట్ చేస్తున్నారు.