Read more!

English | Telugu

కార్ కాకుండా ట్రక్ కొన్నావా... అంటున్న నెటిజన్స్


గత ఏడాది వరసపెట్టి కార్లు, టూర్లు, పెళ్లిళ్లు, పేరంటాలు, సీమంతాలు, పిల్లలు, గృహప్రవేశాలు వగైరా రకరకాల సెలెబ్రేషన్స్ తో బుల్లితెర సెలబ్రిటీస్ అంతా హంగామాగా ఉన్నారు. ఈ ఏడాది మాత్రం ఆ హడావిడి కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. ఐతే ఇల్లాంటి డల్ టైంలో దీప్తి సునైనా  ఒక కార్ కొనేసి రచ్చ చేసింది.  దీప్తి కొన్న ఈ  కారు టయోటా హై లక్స్ . అయితే ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చునే అవకాశం ఉంది.

అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికిఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఒక నెటిజన్ "భలే కార్" అని కామెంట్ చేసేసరికి "ఎం బాలేదా..మోడిఫై చేయించాలి, లగేజ్ తో లాంగ్ ట్రిప్స్ కి వెళ్ళడానికి బాగుంటుందని తీసుకున్నా" అని రిప్లై ఇచ్చింది. "ఇది కార్ కం ట్రక్ అని కామెంట్ చేస్తున్నారు. ఎన్నో కార్లు ఉండగా ఈ కారునే మీరెందుకు కొన్నారు...? కార్ బాలేదు...ఇలాంటి ట్రక్ ఎందుకు తీసుకున్నావ్ ? ఇండియాలో బెస్ట్ పికప్ ట్రక్ కొనుక్కుంది దీప్తి.

కార్ కొన్నావనుకున్న ట్రక్ కొన్నావా ? పాల ప్యాకెట్లు, వాటర్ కేన్లు వేస్తావా ? సారీ జస్ట్ జొకింగ్" అంటూ దీప్తి కార్ కం ట్రక్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమందైతే కంగ్రాట్యులేషన్స్ అని మెసేజెస్ పెడుతున్నారు. దీప్తి యూట్యూబర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మాడు కవర్ సాంగ్స్ అంటూ.. వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ కార్ ఖరీదు సుమారు 30 లక్షల పైమాటే. ఏదైతే ఏముంది మంచి కార్ కొన్నారు అంటున్నారు. ఇక కార్ కొన్నాక ఆ సెలెబ్రేషన్స్ లో భాగంగా కేక్ కూడా కట్ చేసింది అమ్మడు.