గిన్నిస్ బుక్ లో పద్మభూషణ్ పి.సుశీల..!
ఆమె గొంతు మధురం. ఆమె పాట అమృతం. ఆమె గానం అమోఘం. ఒకటి కాదు, రెండు కాదు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని తన గాన మాధ్యుర్యంతో కట్టిపడేసిన పి.సుశీలమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు ఇలా దాదాపు అన్ని భారతీయ భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన ఘనత ఈ గానకోకిలకు సొంతం