Read more!

English | Telugu

మెగా హీరోలకు కూడా చిరంజీవే గ్యాంగ్ లీడర్..!

శ్రీజ పెళ్లి సంగీత్ లో జరిగిన ఒక్కొక్క సీన్ ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. ఇప్పటికే సుస్మిత చిరుతో డాన్స్ వేసిన క్లిప్, వరుడు కళ్యాణ్, శ్రీజలు డ్యాన్స్ వేసిన క్లిప్ లు ఇప్పటికే ట్రెండ్ అవుతుండగా, లేటెస్ట్ గా మెగా యంగ్ హీరోలందరూ మెగాస్టార్ తో కలిసి స్టెప్స్ వేసిన క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. బన్నీ, రామ్ చరణ్, వరుణ్, సాయిధరమ్ తేజ అందరూ కలిసి గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ కు స్టెప్స్ వేస్తూ, మెగాస్టార్ చిరంజీవిని కూడా మధ్యలోకి తీసుకొచ్చారు.

చివర్లో బన్నీ, చరణ్ చిరును కౌగలించుకున్నారు. ఈ క్లిపింగ్స్ ను మెగా ఫ్యాన్స్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న చిరు ఫాం హౌస్ లో శ్రీజ కళ్యాణ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఖరీదైన పెళ్లిళ్ల లిస్ట్ లో శ్రీజ పెళ్లి కూడా ఉంటుందంటున్నారు మ్యారేజ్ కు హాజరైన వారు. తన స్టేటస్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ మ్యారేజ్ ను చిరు జరిపించారు. మెగా క్యాంప్ మొత్తం ఈ పెళ్లి కోసం ఒకచోట చేరడం విశేషం.