Read more!

English | Telugu

కంచె కు జాతీయ పురస్కారం పట్ల ఫుల్ హ్యాపీస్..!

విలువలను, కమర్షియల్ ఎలిమెంట్స్ ను కరెక్ట్ గా మిక్స్ చేసి, క్రిష్ జాగర్లమూడి రూపొందించిన సినిమా కంచె. రిలీజయ్యినప్పుడే అద్భుతమైన సినిమా అని విమర్శకుల ప్రశంసలు అందుకున్న కంచె తెలుగు తరపున ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 63వ జాతీయ అవార్డుల్లో ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం పట్ల మూవీ యూనిట్ అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా ఈ స్టోరీలైన్ ను, సినిమాను రూపొందించాం. అంత ఇష్టపడి చేసిన సినిమాకు ఇంతటి ఆదరణ, గౌరవం లభించడం అదృష్టంగా భావిస్తున్నానంటూ దర్శకుడు క్రిష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇది తమతో పాటు, ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ దక్కిన గౌరవమని, అందరకీ పేరుపేరునా ధన్యవాదాలంటూ చిత్ర నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి తెలిపారు. కాలం మారినా, మనుషుల మధ్య కనపడకుండా ఉన్న కంచెల్ని తొలగించినప్పుడే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది అనేది కంచె బేసిక్ స్టోరీ లైన్. రిలీజైన సమయంలోనే, విశ్లేషకులు సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి మరీ, మూవీని అభినందిచడం విశేషం. అంతటి ఆదరణ సొంతం చేసుకున్న కంచెకు జాతీయ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.