Read more!

English | Telugu

డ్యాన్సులతో అదరగొట్టిన చిరు కూతురు, అల్లుడు..!

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్లి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల పెళ్లిగా సెలబ్రేట్ చేయబోతున్న మెగాకుటుంబం, అందుకే తగ్గట్టే తమ ఎంజాయ్ మెంట్ కూడా ఉండేలా ప్లాన్ చేసింది. చిరంజీవి తరపున కుటుంబాలతో పాటు, వరుడు కళ్యాణ్ తరపున బంధువర్గాలందరి కలయికతో, మెగా కాంపౌండ్ లో పెళ్లిసందడి ఉట్టిపడుతోంది. సంగీత్ లో చిరు తనయ, అల్లుడు కలిసి పవన్ పాటలతో పాటు, బాలీవుడ్ మెలోడీస్ కు కాళ్లు కదిపారు. ఇద్దరి స్టెప్స్ కూ అక్కడున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంకరేజ్ మెంట్ తోడవడంతో పండగ వాతావరణం కనిపిస్తోంది.

ప్రస్తుతం ట్విట్లర్లో శ్రీజ పెళ్లి వీడియోను మెగాభిమానులు చూసి ఆనందించి రీట్వీట్ చేస్తున్నారు. పెళ్లి హడావిడంతా బెంగుళూరు ఫామ్ హౌస్ లోనే జరుగుతోంది. అల్లు కుటుంబం, కొణిదెల కుటుంబం కలిసి సెలబ్రేషన్స్ ను ఒకరేంజ్ లో జరుపుతున్నారు. పెళ్లి హడావిడి ముగిసిన తర్వాత, 31న హైదరాబాద్ లోని హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాట్లు ప్లాన్ చేసి, ప్రముఖులకు ఆహ్వానించారు చిరంజీవి. మెగా హీరోలందరూ, షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని పెళ్లిలోనే ఉండిపోయారు. కూతురు అల్లుడుతో సమానంగా మెగాస్టార్ కూడా స్టెప్ట్ ఇరగదీయడం విశేషం.