English | Telugu

పొట్ట కోస్తున్నారు...పాట పాడమన్నారు...కట్ చేస్తే చిన్మయి భజన పాడుతోంది

"అలా మొదలయ్యింది" షోలో వచ్చే సెలబ్రిటీస్ చెప్పే విషయాలు ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అలాంటి షోకి ఈ వారం సింగర్ చిన్మయి శ్రీపాద, యాక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇద్దరూ జంటగా వచ్చారు. అందులో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.." డెలివరీ టైంలో  ఏదో విషయం జరిగిందట కదా...చాలా ఎమోషనల్ కూడా అయ్యారట.. అదేంటో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని కిషోర్ అనేసరికి " నా లైఫ్ లో చిన్నూ డెలివరీని అస్సలు మర్చిపోలేను. డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉంది...రొటీన్ చెకప్ కి వెళ్ళినప్పుడు టెక్నికల్ గా డాక్టర్ ఏదో విషయం చెప్పారు.

ఆరియానాకి పెళ్లి చూపులు.. ఇద్దరినీ చేసుకుంటాను!

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ఈవారం ఎపిసోడ్ చాలా కలర్ ఫుల్ గా మంచి కామెడీతో నవ్వించింది. ఈ షోకి అవినాష్- ఆరియానా, ఆర్జే సూర్య - ఫైమా వచ్చారు. ఎగ్ బ్రేక్ చేసే టాస్క్ లో తాను హెల్ప్ చేయాలి అంటే అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పాలి అంటూ ఓంకార్ ఒక  కండిషన్ పెట్టాడు ఆరియానాకి.."ఆరియానా పెళ్ళెప్పుడు..అసలు ఎలాంటి అబ్బాయి కావాలి" అని ఓంకార్ అడిగేసరికి "నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా..అర్ధం చేసుకునే అబ్బాయి వస్తే చాలు" అని చెప్పింది ఆరియానా. "సరే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి నా టీమ్ లో ముగ్గురు పెళ్లి కానీ వాళ్ళు ఉన్నారు..ఒక్కొక్కరిని స్టేజి మీదకు తీసుకొస్తాను. నీకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు" అన్నాడు ఓంకార్. "సిక్స్త్ సెన్స్ లో ఆరియానాకి పెళ్లి చూపులు జరగబోతున్నాయి అది కూడా ఓంకార్ గారి చేతుల మీదుగా" అని కోరస్ ఇచ్చాడు అవినాష్.

 రీల్స్ కి ఫుల్ ఫార్మ్ చెప్పి కోచింగ్ ఇచ్చిన రాంప్రసాద్ 

ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి కామెడీగా ఫన్నీగా సాగింది. ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో అలరించింది. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ టీమ్స్ మధ్య ఈ వారం పోటీ జరిగింది.  అందులో ఆటో రాంప్రసాద్ స్కిట్ హిలేరియస్ గా నవ్వించింది. "ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి చాలామంది ఫేమస్ అయ్యారు...వాళ్ళ లాగే మీరు కూడా ఫేమస్ అవ్వాలి అనుకుంటే వెంటనే రాంప్రసాద్ రీల్స్ కోచింగ్ సెంటర్ లో చేరండి...రీల్స్ ఎలా చేయాలో ఇక్కడ నేర్పబడును" అనే ట్రెండింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. ముందుగా రీల్స్ చేసేసి అందరూ ఫుల్ ఫేమస్ ఇపోదామని అనుకుంటున్నారు కానీ అసలు రీల్స్ కి ఫుల్ ఫార్మ్ ఏంటో ఎవరికీ తెలీదు. అసలు రీల్స్ అంటే "రోతగా ఎందుకూ పనికిరాని ఎర్రిపప్పలు లక్ష్యం లేకుండా సావదొబ్బుతుంటారు" అని చెప్పాడు రాంప్రసాద్..రీసెంట్ గా "ఒక అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయ్యి చనిపోదామనుకున్నపుడు ఒక మొక్క నేనే ఇచ్చి అందులో తన లవర్ ని చూసుకోమని చెప్పాను అప్పటి నుంచి ఆ అమ్మాయి బంగారం ఒకటి చెప్పనా" అంటూ రీల్స్ చేసి ఫేమస్ ఐపోయింది అని చెప్పాడు.

మన షోకి కూడా రెండు కాకుల్ని పెట్టండి అన్న సుమ

"సుమ అడ్డా" షో ఈ వారం బలగం వేణు కామెడీతో సరదాగా సాగింది. ఈ వారం షోకి వేణు వండర్స్, చమ్మక్ చంద్ర, ధనరాజ్, విష్ణుప్రియ వచ్చారు. రాగానే వేణు మీద సీరియస్ అయ్యింది సుమ. "బలగం సినిమా వాళ్ళ ఒకరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకోక తప్పడం లేదు." అనేసరికి "ఎవరివండి" అన్నాడు వేణు. " అన్ని అవార్డులు, ఫెలిసిటేషన్లు మీకేనా...ఆ కాకిని ఫెలిసిటేట్ చేయరా" అనేసరికి వేణు పగలబడి నవ్వేసాడు. " ఈ ఇయర్ మాత్రం కాకి ద్వారా అన్ని హిట్స్ కొడుతున్నాం" అన్నాడు.. "బలగంలో కాకి, విరూపాక్షలో కాకి, దసరాలో కాకి..థిస్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ ది కాకి...మన సుమ అడ్డా షోకి కూడా డబుల్ డిజిట్ రేటింగ్ రావాలి వెంటనే రెండు కాకుల్ని తీసుకొచ్చి వెనకాల పెట్టండి" అంది సుమ చాలా ఫన్నీగా. తర్వాత మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటూ ఒక టాస్క్ ఇచ్చింది సుమ.

నాకు రొమాన్స్ ఇష్టం...ఆ సీన్ లో అద్దం ముక్కలు మీద పడేసరికి భయమేసింది అన్న కేశవ

ఆహా ఓటిటి వేదిక మీద స్ట్రీమ్ అవుతున్న" సత్తిగాని రెండెకరాలు" మూవీ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీలో నటించిన పుష్ప కేశవ చాలా బాగా నటించాడు. మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కేశవ , మోహనశ్రీ టేస్టీ తేజతో కలిసి ముచ్చట్లు పెట్టారు. "నేను వరంగల్ లోని లాల్ బహదూర్ కాలేజ్ లో బి.ఎస్సి  పౌల్ట్రీ సైన్స్ చదివాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే కోళ్ల డాక్టర్ లెక్క..కోళ్ల ఫారాలకు వెళ్లి అక్కడ కోళ్ల పరిస్థితిని చూసుకునే చదువు అది. ఈ మూవీ డైరెక్టర్ అభినవ్ రెడ్డితో ఎడిటర్ గా ఉన్న టైంలో అంటే  2019 లో "గాడ్స్ ఆఫ్ ధర్మపురి" అని మూవీ చేసాను.

గేట్ ఎగ్జామ్ కి కొత్త అర్ధం చెప్పిన పవిత్ర..సెట్ ని హాట్ గా మార్చిన సుస్మిత

సూపర్ క్వీన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఈ వారం "ఫేస్ ఆఫ్ ఛాలెంజ్" రౌండ్ ఇచ్చాడు ప్రదీప్. అందులో భాగంగా ఇద్దరు సూపర్ క్వీన్స్ వచ్చి కొన్ని జోక్స్ చెప్పి మిగతా వాళ్ళను నవ్వించాలి. అలా మొదటగా సుహాసిని-పవిత్ర వచ్చి కొన్ని జోక్స్ చెప్పారు..కానీ అవి పెద్దగా పేలలేదు. కానీ అందులో పవిత్ర గేట్ ఎగ్జామ్ కి కొత్త అర్ధం చెప్పింది.."గేట్ ఎగ్జామ్ రాద్దామని ప్రిపేర్ అయ్యాను బ్రో" అని పవిత్ర అనేసరికి "అసలు గేట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తారు" అని పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేసాడు ప్రదీప్.