Read more!

English | Telugu

మన షోకి కూడా రెండు కాకుల్ని పెట్టండి అన్న సుమ

"సుమ అడ్డా" షో ఈ వారం బలగం వేణు కామెడీతో సరదాగా సాగింది. ఈ వారం షోకి వేణు వండర్స్, చమ్మక్ చంద్ర, ధనరాజ్, విష్ణుప్రియ వచ్చారు. రాగానే వేణు మీద సీరియస్ అయ్యింది సుమ. "బలగం సినిమా వాళ్ళ ఒకరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకోక తప్పడం లేదు." అనేసరికి "ఎవరివండి" అన్నాడు వేణు. " అన్ని అవార్డులు, ఫెలిసిటేషన్లు మీకేనా...ఆ కాకిని ఫెలిసిటేట్ చేయరా" అనేసరికి వేణు పగలబడి నవ్వేసాడు. " ఈ ఇయర్ మాత్రం కాకి ద్వారా అన్ని హిట్స్ కొడుతున్నాం" అన్నాడు.. "బలగంలో కాకి, విరూపాక్షలో కాకి, దసరాలో కాకి..థిస్ ఈజ్ ది ఇయర్ ఆఫ్ ది కాకి...మన సుమ అడ్డా షోకి కూడా డబుల్ డిజిట్ రేటింగ్ రావాలి వెంటనే రెండు కాకుల్ని తీసుకొచ్చి వెనకాల పెట్టండి" అంది సుమ చాలా ఫన్నీగా. తర్వాత మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటూ ఒక టాస్క్ ఇచ్చింది సుమ.

దానికి విష్ణుప్రియ తన లవ్ స్టోరీ చెప్పింది "నాది వన్ సైడ్ లవ్..ఫోర్త్ క్లాస్ నుంచి చెప్పనా పేరు" అని అడిగేసరికి "కొంపదీసి నువ్వు ప్రేమించింది అఖిల్ నా ఏమిటి" అని సుమ అడిగేసరికి "అవును" అంది విష్ణుప్రియ చెప్పేసరికి  లాస్ట్ ఎపిసోడ్ లో అఖిల్ సుమకి రెడ్ రోజ్ ఇచ్చే బిట్ ప్లే చేశారు. "నాకు రెడ్ రోజ్ ఇచ్చాడని నువ్వేమన్నా ఫీలవుతున్నావా" అని సుమ విష్ణుప్రియను అడిగింది. "లేదు ఫీలవ్వట్లేదు...అసలు అఖిల్ షోస్ కి రాడు. అలాంటిది మీ వల్ల వచ్చి మాకు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అందించారు కదా...అయ్యగారే నంబర్ వన్" అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది విష్ణుప్రియ.