Read more!

English | Telugu

జగతికి దూరమైన వసుధార.. రిషి గమ్యం ఎటువైపు!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-775లో.. రిషి తన చేతికి ఉన్న రింగ్ ని వసుధారకి ఇచ్చేసి.. ఇంకెప్పుడు తన కంట పడనకని వసుధారతో చెప్తాడు.. సర్ మీ నీడని నేను.. మిమ్మల్ని వదిలి పెట్టి ఎక్కడికి వెళ్లిపోను అని వసుధార ఏడుస్తుంది.. నా ప్రాణమే అనుకున్నా కానీ చంపేసారు.. ఇంక నీడ ఎక్కడిదని రిషి అంటాడు. నా జీవితంలో మీరు ఎప్పుడు కన్పించకండంటూ చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత జగతి వచ్చి వసుధారని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. తనని ముట్టుకోవద్దు.. మీ వల్లే రిషి సర్ వెళ్ళిపోయాడు. మా ప్రేమకి కారణం మీరే.. మేము విడిపోవడానికి కారణం మేరే అని జగతితో వసుధార అంటుంది. నేనేం చేసిన మీ కోసమే కదా వసుధార అని జగతి అంటుంది. ఏం ప్రయోజనం మేడమ్..  రిషి సర్ కి అన్ని విషయాలు చెబ్దామని నేను ముందు నుంచి మీతోని చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడండి తన మనసులో నుండి చెరిపేసి..‌ఇక రానంటూ వెళ్ళిపోయాడని జగతితో వసుధార అంటుంది... జరిగేదంతా కూడా రిషి సర్ కి చెపుదామని చెప్పిన మీరు వినలేదు.. మేడం మీరు నన్ను ఎప్పుడు కలిసే ప్రయత్నం చెయ్యకండి ప్లీజ్.. రిషి సర్ లాగా అందరిని వదిలేసి నేను కూడా ఒంటరిగా వెళ్లిపోతున్నాను. దయచేసి నా వెంట రావద్దని దండం పెట్టి వెళ్ళిపోతుంది వసుధార.. జగతి ఆవేదనగా చూస్తూ వసుధార అగు అంటుంది. వసుధార ఏడుస్తూ ఆటోలో వెళ్ళిపోతుంది. జగతి ఏం చేయలేక కిందపడి ఏడుస్తూ.. వసు వసు అంటూ పిలుస్తుంది. ఆ తర్వాత వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వసుధారని చూసిన వాళ్ళ అమ్మ సుమిత్ర.. ఏమైంది ఒక్కదానివే వచ్చావ్? అల్లుడు గారు ఎక్కడ అని సుమిత్ర అడుగుతుంది. తను రాలేదని వసుధార అంటుంది.

ఆ తర్వాత కృష్ణమూర్తి, సుమిత్రలకి జరిగిందంతా చెప్తుంది వసుధార. ఏంటీ నీ బతుకు ఇలా అయిపోయింది అంటూ వసుధారని చూసి సుమిత్ర ఏడుస్తుంది. వసుధార జరిగిందత చెప్పింది విన్నాక సుమిత్ర బాధతో కిందపడిపోతుంది. ఏమైంది అమ్మ అంటూ వసుధార ఏడుస్తుంది. శైలేంద్ర, దేవయాని చేసిన కుట్రలో జగతితో బంధం తెచ్చుకొని పోయిన రిషి, వసు లు.. మరొకవైపు అందరికి దూరంగా వెళ్తాడు రిషి. రిషి ఒక్కడే ఎలా బ్రతుకుతాడు? ఎక్కడ ఉంటాడు అనే ఆసక్తితో  ఉంది. మరి ఈ కథ మళ్ళీ ఏ వైపు తీరనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.