Read more!

English | Telugu

మురారి తన డైరీని ఎవరికీ తెలియకుండా కాల్చేసాడా?

స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఓ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-168లో.. మధు డైరెక్ట్ చేసిన షార్ట్ మూవీ ప్రివ్యూని ఇంట్లో వాళ్ళముందు ప్లే చేసి చూపిస్తాడు. ఆ ప్రివ్యూలో మురారికి కృష్ణ ప్రపోజ్ చేయడం.. తన డైలాగ్ లు విని అందరూ కృష్ణని బాగా చేసావని మెచ్చుకుంటారు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి.. చాలా గొప్పగా నటించావ్ కృష్ణ.. అచ్చం నువ్వే మురారి లవర్ లాగా చెప్పావ్.. ఆ స్క్రిప్ట్ మధూకర్ రాసాడంటే నమ్మలేకపోతున్నా అని ముకుంద అంటుంది. ఆ మాటలు స్క్రిప్ట్ లో లేవని.. ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయానని కృష్ణ అంటుంది. అవునా అయితే నువ్వు మాములు నటివి కాదు మహానటివని ముకుంద అంటుంది. అదంతా నాకు‌ తెలియదు.. సిచువేషన్ ‌చెప్పి చేయమంటే అలా చేసానని చెప్పేసి కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

 

ఆ తర్వాత ముకుంద కంగారు పడుతుంది. నాలుగు రోజుల్లో వెళ్ళిపోయే మనిషికి ఈ ఎమోషన్స్ ఏంటి.. అంటే కృష్ణ మురారితో ప్రేమలో పడిందా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లోవాళ్ళంతా డిన్నర్ చేస్తుండగా.. మధూకర్ ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాడు. కృష్ణ ముకుంద మురారి మీరు ముగ్గురు ఈ కథని వినాలని చెప్తాడు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. అయితే ఆ అబ్బాయికి డైరీ రాసే అలవాటుంటుంది. ఆ డైరీలో తను ప్రేమించిన అమ్మాయి గురించి రాసి ఉంటుంది. అయితే ఆ డైరీని అమ్మాయి చూడకుండా అలమరాలో పెడుతుండగా డైరీ కిందపడిపోతుంది, ఆ డైరీలోని కవిత్వం చూస్తుంది.. అయితే ఆ కవిత్వం ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయి గురించి అని చెప్తాడు మధు. అయితే ఆ అబ్బాయికి అంతకన్నా ముందు ఒక లవ్ స్టోరీ ఉందా అని కృష్ణ అడుగుతుంది‌. అవునని మధు అంటాడు. డైరీ చదివాక ఆ అమ్మాయి ఏం చేసిందని మధు భార్య అడుగగా.. నీకో లవర్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదని చెంప చెల్లుమనిపించిందని మధు అంటాడు. ఆ తర్వాత అందరు ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు.

 

అయితే మురారికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. అందులో ముకుందని ప్రేమిస్తున్నప్పటి రోజుల్లో తన గురించి రాసిన కవిత్వం ఉంటుంది. ఇది కృష్ణ చూస్తే ఎక్కడ తనని విడిచి వెళ్ళిపోతుందని భావించి ఆ డైరీని కాల్చి బూడిద చేయాలని ఎవరికీ కనపడకుండా షర్ట్ లోపల పెట్టుకొని తీసుకెళ్తుండగా ఇంట్లో వాళ్ళంతా హాల్లోనే ఉండటంతో వాళ్ళు కూడా బయటకు వస్తానంటారు. మరి మురారి తన డైరీని బయటకు తోసుకెళ్ళి కాల్చేసాడా? లేక కృష్ణకి అసలు నిజం తెలిసిపోయిందా? అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.