English | Telugu

ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిన ముకుంద, మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -178 లో.. "మురారి ఎందుకు డల్ గా ఉంటున్నాడు. ఏదైనా బాధ ఉంటే నలుగురితో పంచుకోవాలి కానీ వీడు ఎందుకని ఇలా చేస్తున్నాడని రేవతి బాధపడుతుంది. ఎలాగైనా వాడితో మాట్లాడాలని అదేపనిగా రేవతి అనుకుంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి.. అత్తయ్య కాఫీ అని అడుగుతుంది. రేవతి కాఫీ చేస్తుండగా..అత్తయ్య మనం లేచిపోదామా అని తింగరి మాటలు మాట్లాడుతుంటే.. ఏంటి రాత్రి తాగింది ఇంకా దిగలేదా అని రేవతి అంటుంది. అత్తయ్య నేనేం తాగాను అని కృష్ణ అమాయకంగా అడుగుతుంది.. మ్యాంగో జ్యూస్ తాగావ్ లే అని రేవతి అంటుంది. మా మంచి అత్తయ్య మీలానే మీ అబ్బాయి కూడా అంటూ రేవతి చెంపపై ముద్దుపెట్టి కాఫీ తీసుకుని వెళ్తుంది కృష్ణ.

ఎవరికీ కనబడకుండా ముద్దు పెట్టేసారు

కొంతకాలంగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న కపుల్ షో "అలా మొదలయ్యింది" గురించి అందరికీ తెలుసు. సెలబ్రిటీ కపుల్స్ ను ఈ షోకి  పిలిచి వారి గురించి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను బయటి రాబడుతూ ఉంటారు. అలాంటి షోకి ఈ వారం శివబాలాజీ, అతని భార్య మధుమిత గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నోవిషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక చివరిలో "నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా" అంటూ శివబాలాజీ కిషోర్ ని అడిగాడు. "వామ్మో ఇదేంటి నాకు క్వశ్చనా" అని అడిగేసరికి "అవును నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి..చాలామంది డిస్టర్బ్ ఐపోతున్నారట..." అని చెప్తూ మంచు విష్ణుకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్  చేసాడు.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ కిర్రాక్ ఆర్పీ ఎక్కడ!

పంచ్ ప్రసాద్ అనగానే కిర్రాక్ ఆర్పీ పేరు వెంటనే గుర్తోచేస్తుంది. ఎందుకంటే  జబర్దస్త్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాక వాటన్నిటినీ వదిలేసి "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు" పేరుతో రెస్టారెంట్ పెట్టి కొన్ని నెలల్లోనే బాగా ఫేమస్ అయ్యాడు. ఆ టైంలోనే పంచ్ ప్రసాద్  హెల్త్ కి సంబంధించి  మొత్తం ఖర్చు భరిస్తాను అని చెప్పిన ఆర్పీ ఇప్పుడు ముఖం చాటేశాడు అంటున్నారు నెటిజెన్స్..దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆర్పీ ఎక్కడా కనిపించడం లేదు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కుదుటపడేవరకు  అతని మొత్తం బాధ్యతలను తానే దగ్గరుండి చూసుకుంటాను అని మీడియా వేదికగా గట్టిగానే హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సర్జరీ చేయాల్సిన సమయం వచ్చింది కానీ ఆర్పీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జబర్దస్త్ టీం మొత్తం కూడా ఫండ్ రైజ్ చేసినా ఆర్పీ మాట ఎక్కడ వినిపించలేదు.

ఈ షోకి కూడా ఆ జడ్జిస్సేనా...బోరింగ్...

నిన్న గాక మొన్న బీబీ జోడి ఇలా పూర్తి చేసుకుందో లేదో "నీతోనే డాన్స్" అనే మరో డాన్స్ షో స్టార్ట్ కావడానికి సిద్ధమైపోయింది. బీబీ జోడిలో అందరూ బీబీ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. కానీ ఈ "నీతోనే డాన్స్" షోకి మాత్రం సీరియల్ యాక్టర్స్ ని, జబర్దస్త్ కమెడియన్స్ ని తీసుకొచ్చారు. ఇక బీబీ జోడి జడ్జెస్ టీం మాత్రం నిను వీడని నీడను నేనే అన్నట్టుగా ఈ షోకి కూడా కలిసికట్టుగా వచ్చేసారు.. వాళ్ళే అలనాటి అందాల సీనియర్ నటి రాధ, రాను రాను అంటూ తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఉండిపోయిన సదా అలాగే తరుణ్ మాస్టర్. ఇక హోస్ట్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆదివారం రాత్రి 9   గంటలకు  గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది ఈ షో.  

బాహుబలిలో ఛాన్స్ ఇస్తే ఆ రోల్ లో చేసేదాన్ని....

పటాస్ షో ద్వారా అందరికీ తెలిసిన జబర్దస్త్ షో లేడీ కమెడియన్ గా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ఫాన్స్ ని  సొంతం చేసుకుంది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా ఇప్పుడు బుల్లితెర మీద షోస్ చేస్తూ తనకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకుంది. ఆమె చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా మీమ్స్, ట్రోల్ల్స్ అవుతూనే ఉంటాయి. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక టాప్ కమెడియన్స్ లిస్ట్ లోకి వెళ్లిన ఫైమాకి బిగ్ బాస్ 6 హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమెఇంకా ఫేమస్ ఐపోయింది. ఆమె యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉంటుంది. అలాగే తన పేజీకి రీసెంట్ గానే బ్లూ టిక్ కూడా వచ్చింది. అలాంటి ఫైమా ఇప్పుడు ఆడియెన్స్ తో చిట్ చాట్ చేసింది.

నాన్న గురించి సుదీర్ఘ లేఖను రాసిన రిషి సర్!

గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి సర్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. అతని స్టైల్, అతని ఆటిట్యూడ్ ని యూత్ ఫాలో అవుతోంది. ఇక బుల్లితెర మీద వసుధారా, రిషి సర్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. వాళ్ళ మ్యాజిక్ తోనే ఆ సీరియల్ టాప్ రేటింగ్ లోకి వెళ్ళింది. అలాంటి రిషి సర్ లైఫ్ లో తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్నను రీసెంట్ గా కోల్పోయారు. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసుకున్నారు. ఐతే ఇప్పుడు తన మనసులో ఉండిపోయిన ఎన్నో విషయాలను చాల సుదీర్ఘంగా పంచుకున్నారు. "నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, మనం  పంచుకున్న సమయాలు గుర్తొచ్చి  , నా హృదయం వేదనతో నిండిపోతోంది.