English | Telugu

అందరి గురించి నా‌ జీవితంలో అన్నీ త్యాగం చేశాను!

ఆట సందీప్-జ్యోతిరాజ్.. ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న కొరియోగ్రాఫర్స్. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి డాన్స్ కి క్రేజ్ ఉంటుంది. లాక్ డౌన్ లో కూడా వీళ్ళిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ వీడీయోలు తెగ వైరల్ అయ్యాయి. ఆట షోతో వెలుగులోకి వచ్చిన వాళ్ళిద్దరు.. ప్రస్తుతం ప్రతీ ఈవెంట్ లో, మూవీ ఆడియో ఫంక్షన్స్ అంటు ఎక్కడ చూసిన ఈ జోడినే కన్పిస్తుంది. అందరు వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రెస్ మీట్ లో స్టేజ్ మీద సందీప్ జ్యోతీల మధ్య సాగిన సంభాషణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ మాట్లాడిన సందీప్ మాటలకి జ్యోతి మంచి కౌంటర్ వేసింది. దాంతో ఆ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు.

తమిళ నటుడు శివకార్తికేయన్ తో సుడిగాలి సుధీర్ ని పోల్చిన శివబాలాజీ

ఒక వైపు బుల్లితెర మీద మరో వైపు సిల్వర్ స్క్రీన్ మీద దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్..ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర'. అరుణ్ విక్కిరాల డైరెక్షన్ లో  విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు క‌టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. సుధీర్ కి జోడీగా  'డాలిశ్య' హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫంక్షన్ లో శివబాలాజీ సుధీర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.  "సుడిగాలి సుధీర్ నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు. కానీ ఇద్దరం కలిసి స్మాల్ స్క్రీన్ ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ మూవీలో స్క్రీన్ షేర్  చేసుకుంటున్నాం. సుధీర్ మీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. ఎవరితోనైనా మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. మంచి మ్యానర్స్ ఉన్న మనిషి. మంచి ఆర్టిస్ట్ కూడా..అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు.

మహేష్ బాబుకి వయసే అవదా

రాజన్న మూవీ ద్వారా చక్కటి నటన ప్రదర్శించి "యాని " ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె పండించిన ఎమోషన్స్ కు ఏడవని వారు ఎవరూ లేరు. ఈ సినిమాకు  ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డ్  అందుకుంది. 'అనుకోకుండా ఒక రోజు' మూవీతో  ఇండస్ట్రీకి పరిచయమైన యాని రాజమౌళి డైరెక్షన్ లో  రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ మూవీలో కూడా  నటించింది. ‘రంగస్థలం’ మూవీలో రాంచరణ్ చెల్లెలిగా చేసింది. అలాంటి యాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పింది. "యాన్జిబి  అనేది నా రియల్ నేమ్. మా నాన్న పేరు నా పక్కన వస్తుంది. పర్సనల్ గా నాకు ప్రభాస్ గారు ఇష్టం..యాక్టింగ్ పరంగా వెంకటేష్ గారు ఇష్టం.

ఆ సీన్ చేసేటప్పుడు నితిన్ ఏడ్చేశాడు...సదా కార్ కి యాక్సిడెంట్ అయ్యింది

 ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "అహింస" మూవీ నుంచి  డైరెక్టర్ తేజ, దగ్గుబాటి అభిరాం వచ్చారు. పటాస్ ప్రవీణ్ అండ్ టీం చేసిన స్కిట్ కి తేజ ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నారు. "జయం" మూవీలో నితిన్ నడుముకు తాడు కట్టుకుని దిగే సీన్ ని  స్పూఫ్ గా చేసి చూపించారు..ఈ స్కిట్ పూర్తయ్యాక ఆ  సీన్ కి సంబంధించిన కొన్ని మెమోరీస్ ని షేర్ చేసుకోమని రష్మీ తేజను అడిగింది. "ప్రియతమా తెలుసునా" సాంగ్ తోనే సినిమా స్టార్ట్ చేసాం. ఆ సాంగ్ చేసేటప్పుడు నితిన్ కి రోప్ కట్టాం మళ్ళీ స్ట్రింగ్స్ కూడా కట్టాం..

చిన్నప్పటి నుంచే ఉందా ఈమధ్యనే మొదలయ్యిందా

దీప్తి సునైనా పేరు వినని వారు లేరు. మూవీస్ లో పెద్దగా నటించకపోయినా  వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో సోషల్ మీడియా లో  మోస్ట్ పాపులర్ ఐపోయింది ఈ బ్యూటి. అయితే గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడం వలన  దీప్తి ఇంకా ఫేమస్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది.   అలా నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇక ఈ క్యూటీకి  విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అలాంటి దీప్తి ఇప్పుడు "ఇంటరెస్టింగ్ ప్రశ్నలు ప్లీజ్" అని అడిగేసరికి  నిజంగానే ఇంటరెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.."మీకు చిన్నప్పటినుంచే పిచ్చా లేదా ఈమధ్య నుంచేనా" అని అడిగేసరికి "అమ్మ పొట్టలో ఉన్నప్పటినుండే" అని కోతి ఎమోజి పెట్టి మరీ కొంటెగా ఆన్సర్ చేసింది . "ఒక్క రోజైనా స్టోరీస్ పోస్ట్ చేయకుండా ఉండరా" అని అడిగేసరికి "అఫ్ కోర్స్ ఎస్" అని ఆన్సర్ చేసింది. "మీ కాలర్ ట్యూన్" ఏమిటి అని అడిగేసరికి "ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా" అంటూ ఆడియో పోస్ట్ చేసింది దీప్తి.