Read more!

English | Telugu

టీఆర్పీలో ఈ వారం కూడా ప్రథమ స్థానంలో బ్రహ్మముడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి సీరియల్ గత ఏడు వారాల నుండి టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంటూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ కి ఇప్పుడు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో.. కొత్తగా అరుంధతి, వెన్నెల క్యారెక్టర్స్ రావడంతో ఈ కథ మరింత ఇంట్రెస్ట్ గా సాగుతుంది. 

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా మానస్, కావ్యగా దీపిక రంగరాజు, స్వప్నగా హమీద‌, కనకంగా నీప, రుద్రాణిగా షర్మిత గౌడ, అపర్ణగా శ్రీప్రియ, అప్పుగా నైనిశా, ధాన్యలక్ష్మిగా మాధురి, కళ్యాణ్ గా కిరణ్ కాంత్ నటిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ని కుమార్(చింటు) పంతం డైరెక్టర్ చేస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ ని కూడా కుమార్ పంతం డైరెక్ట్ చేస్తుండటం విశేషం. రెండు సీరియల్స్ కి విభిన్న కథలని రాసుకుని వాటిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు కుమార్ పంతం. బ్రహ్మముడి సీరియల్ లో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకతను చూపిస్తూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ కుమార్ పంతం‌. ఈ సీరియల్ లో దుగ్గిరాల ఫ్యామిలీ ధనవంతులుగా, కనకం-కృష్ణమూర్తిల ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబంగా కనిపిస్తుంటారు. దుగ్గిరాల వారసుడు రాజ్(మానస్) ని కనకం-కృష్ణమూర్తిల పెద్ద కూతురు స్వప్న(హమీద) కి ఇచ్చి పెళ్ళిచేద్దామని అనుకుంటే.. స్వప్న పెళ్ళిపీటల మీద నుండి రాహుల్ తో లేచిపోతుంది‌. దాంతో స్వప్న స్థానంలో.. కనకం తన   రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి పెళ్ళి జరిపిస్తుంది‌. దాంతో రాజ్ వాళ్ళ అమ్మ కావ్యని కోడలిగా అంగీకరించదు. అలా ఈ కథ ముందుకు సాగుతుంది.

తాజాగా ఈ కథలో మరో ట్విస్ట్ వచ్చింది. రాహుల్ తో వెళ్ళిపోయిన స్వప్న మళ్ళీ తిరిగి కనకం-కృష్ణమూర్తిల ఇంటికి వచ్చేస్తుంది. దాంతో కనకం తనకి మళ్ళీ పెళ్ళిచేయాలని చూస్తుంటుంది. అయితే రాహుల్ తనని ట్రాప్ చేసాడని స్వప్న గ్రహించదు.‌ తననే గుడ్డిగా నమ్ముతూ కావ్యని అపార్థం చేసుకుంటుంది. అయితే రాహుల్ కి అరుంధతి కూతురు వెన్నెలనిచ్చి పెళ్ళి చేయడానికి దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఇదే సమయంలో స్వప్నకి తన ఫ్రెండ్ అరుణ్ తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు కనకం ఫ్యామిలీ. కాగా రాహుల్ చాలా మంది అమ్మాయిలని చీట్ చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న కావ్య.. స్వప్నకి చెప్తుందా? అలాగే కావ్య తన తప్పేం లేదని రాజ్ కి నిరూపచుకుంటుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా సాగుతుంది.