Read more!

English | Telugu

టాప్ 1 లో సుహాసిని.. ఎలిమినేట్ ఐన లీస్ట్ స్కోరర్స్

సూపర్ క్వీన్స్ సీజన్ 2 ఈ వారం ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ రౌండ్ ఫుల్ ఫన్నీగా , ఎమోషనల్ గా సాగింది. షో స్టార్టింగ్ లో సూపర్ క్వీన్స్ కి ఒక ఝలక్ ఇచ్చాడు ప్రదీప్. "ఈ వారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంది" అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు. "చెప్పలేదు అగ్రిమెంట్ చేసినప్పుడు" అంది పవిత్ర. "అసలు అగ్రిమెంట్  చదివే సంతకం చేసావా" అని అడిగాడు ప్రదీప్. "నేను టెన్త్ క్లాసే సరిగా చదవలేదు" అంది పవిత్ర ఇంకా ఫన్నీగా. 

ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ లో అందరి పెర్ఫార్మెన్సెస్ ఐపోయాక కంటెస్టెంట్స్ ని పిలిచి వాళ్లకు తప్పించి మిగతా వాళ్లకు మార్క్స్ వేయమని చెప్పాడు ప్రదీప్. అందరూ మార్క్స్ వేసి ఇచ్చాక జోడి ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ రౌండ్ లో ఎవరెవరు గెలిచారో అనౌన్స్ చేసాడు. సింగింగ్ కాంపిటీషన్ లో లిఖిత, జోక్స్ రౌండ్ లో సుహాసిని, ఎమోషనల్ రౌండ్ లో ప్రశాంతి, డాన్స్ ఛాలెంజ్ లో సుష్మిత, మైమ్ రౌండ్ లో ప్రియాంక గెలిచినట్లు అనౌన్స్ చేసాడు. ఇక ఈ సూపర్ క్వీన్స్ లో టేబుల్ బాటమ్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారని అనౌన్స్ చేసాడు ప్రదీప్. ఇక స్కోర్ బోర్డు చూసేసరికి టాప్ 1 లో సుహాసిని 30 మార్క్స్ తో టాప్ లో ఉన్నారు. అలాగే పది మంది కంటెస్టెంట్స్ నుంచి లీస్ట్ స్కోరర్స్ ఎలిమినేట్ అవగా మిగతా వాళ్ళు ఝాన్సీ, పవిత్ర, సుహాసిని, ప్రశాంతి, సుష్మిత, మోనికా, ప్రియాంక మాత్రమే సెట్ లో కనిపించారు. అలాగే ఎస్తేర్, విద్యుల్లేఖ, లిఖిత కనిపించలేదు. వీళ్ళు ఎలిమినేట్ ఐనట్టా కానట్టా అనే విషయం తెలియాలి అన్నా నెక్స్ట్ వీక్ ఈ ఎపిసోడ్ ఇంకా ఎలా జరగబోతుందో తెలియాలన్నా నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.