హిందీ వాళ్ళు ఈ కారణంతోనే పుష్ప 2 చూస్తున్నారంట
బాలీవుడ్ చిత్రాలని ఫాలో అయ్యే వాళ్ళకి ప్రముఖ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్(anurag kashyap)గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.కథని నమ్ముకొని లో బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించి ఎంతో మంది ఫిలిం మేకర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.రైటర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనురాగ్ ఆ తర్వాత దర్శకుడుగా 'పాంచ్' బ్లాక్ ఫ్రైడే,నో స్మోకింగ్, రిటర్న్ ఆఫ్ హనుమన్,ముంబై కటింగ్,గులాల్,గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ పార్ట్ 1 ,పార్ట్ 2 ,బాంబే టాకీస్,ఘోస్ట్ స్టోరీస్,కెనడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభిన్నమైన చిత్రాలకి దర్శకత్వం వహించాడు.