English | Telugu
పాత కక్షలు మళ్లీ బుసలు కొడుతున్నాయి.. బాలీవుడ్ భామల మధ్య ఆగని కోల్డ్‌వార్!
Updated : Dec 18, 2024
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు, బ్రేకప్‌లు, రెండు మూడు పెళ్లిళ్లు.. ఇలా అనేకం ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇది ఎక్కువ అనే విషయం అందరికీ తెలుసు. దాదాపు ప్రతి హీరోయిన్‌కి పెళ్లికి ముందు ఎఫైర్ ఉంటూనే ఉంటుంది. కొన్నాళ్ళు ఒక హీరోతో డేటింగ్ చేసిన తర్వాత మరో హీరోని పెళ్లి చేసుకోవడం అక్కడ సర్వసాధారణం. అంతేకాదు, తమ మాజీ ప్రియుల కోసం పెళ్ళయిన తర్వాత కూడా అప్పుడప్పుడు నోరు పారేసుకుంటూ ఉంటారు హీరోయిన్లు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. అయితే గతంలో జరిగిన ఇలాంటి విషయం ఒకటి ఇటీవల బయటికి వచ్చింది.
దీపికా పదుకోన్‌కి, అలియా భట్‌కి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అలియా భట్ కంటే ముందు రణబీర్ కపూర్‌తో దీపిక డేటింగ్ చేసింది. అందుకే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలియాతోనే కాకుండా అనుష్క శర్మతో కూడా ఆమెకు ఓ వార్ ఉంది. అదేమిటంటే.. ప్రస్తుతం తన భర్త అయిన రణవీర్‌సింగ్ మొదట్లో అనుష్క శర్మతో ప్రేమాయణం నడిపాడు. రణవీర్ తనకు దూరం కావడానికి అన్ని విధాలుగా దీపికానే కారణమని అనుష్క నమ్ముతుంది. అందుకే దీపిక అంటే అనుష్కకు మంట. అందుకే వీలు చిక్కినప్పుడల్లా దీపికపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ ఉంటుంది. ఇటీవల అనుష్క ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో పలు విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఇన్‌డైరెక్ట్‌గా దీపికను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతం ఏదైనా ఇప్పుడు ఎవరి భర్తలతో వారు సంతోషంగానే ఉన్నా ఈ పాత కక్షలను మాత్రం మర్చిపోకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెళ్ళగక్కుతుంటారు.