English | Telugu
సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి.. ఎవరి పని..?
Updated : Jan 15, 2025
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. గురువారం తెల్లవారు జామున ముంబైలోని ఆయన నివాసంలో ఒక దుండగుడు చోరీకి యత్నించాడు. ఆ దొంగను తన సిబ్బందితో కలిసి సైఫ్ అలీ ఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దొంగ, సైఫ్ ను కత్తితో పొడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సైఫ్ ఒంటి మీద ఆరు చోట్ల గాయాలయ్యాయని సమాచారం. సైఫ్ ని వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. (Saif Ali Khan)
అయితే సైఫ్ పై జరిగిన దాడి నిజంగా చోరీకి వచ్చిన దొంగ పనేనా? లేక చోరీ పేరుతో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మూడు దశాబ్దాలుగా హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నారు సైఫ్ అలీఖాన్. ఇటీవల టాలీవుడ్ స్టార్స్ తోనూ ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 'ఆదిపురుష్'లో ప్రభాస్ తో, 'దేవర'లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించారు.
సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి గురించి ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ గారిపై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను, ఆయన త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.