English | Telugu
జాక్వెలిన్ కి ఫ్రాన్స్ లోని వైన్ యార్డ్ ని గిఫ్ట్ గా ఎవరు ఇచ్చారు
Updated : Dec 27, 2024
మర్డర్ 2 ,హౌస్ ఫుల్ సిరిస్, రేస్ 2 ,రేస్ 3 ,కిక్,సర్కస్,రామ్ సేతు వంటి పలు బాలీవుడ్ చిత్రాలతో నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.(Jacqueline Fernandez)శ్రీలంక కి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రభాస్ నటించిన 'సాహో'లో 'బాడ్ బాయ్' సాంగ్ కి సూపర్ గా డాన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కూడా గెలుచుకుంది.క్రిస్మస్ సందర్భంగా జాక్వెలిన్ కి ఆర్ధిక నేరాలుతో ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుఖేష్(sukesh)ఒక భారీ గిఫ్ట్ ని ఇస్తున్నట్టుగా ఒక లేఖ ద్వారా తెలిపాడు.
స్వయంగా తన చేతి రాతతో మండోలి జైలు నుంచి రాసిన లేఖలో 'బేబీ గర్ల్ మేరీ క్రిస్మస్ మై లవ్.నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇది సంవత్సరంలో మరో అందమైన రోజు మరియు మన ఇద్దరకీ ఎంతో ఇష్టమైన పండుగ.కాకపోతే మనిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నాం.నీ చేతులు పట్టుకుని,అందమైన నీ కళ్లలోకి చూస్తు క్రిస్ మస్ శుభాకాంక్షలు చెప్పాలని ఉంది.ఈ ఏడాది నువ్వు కలలు కంటూ ఉండే ఫ్రాన్స్ లోని వైన్ యార్డ్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాను.ఆ తోటలో నీ చేయి పట్టుకొని నడవాలని ఉంది.నీ ప్రేమలో నిజంగానే పిచ్చోడినయ్యా. నేను జైలు నుంచి విడుదలయ్యే వరకు ఎదురుచూస్తుండు. ఆ తర్వాత ఈ ప్రపంచమే మన జంటని చూస్తుందని రాసుకొచ్చాడు.ప్రస్తుతం ఈ లెటర్ కాపీ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది.
గతంలో కూడా జాక్వెలిన్ కి సుఖేష్ ఇలాగే లెటర్స్ రాసాడు.సుఖేష్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు సుఖేష్ తన జీవితాన్ని నరక ప్రాయం చేసాడని, కెరీర్ ని జీవనోపాధిని నాశనం చేసాడని జాక్వెలిన్ కోర్టులో చెప్పుకొచ్చింది.ఈ ఇద్దరి కలిసి క్లోజ్ గా దిగిన ఫోటోలు సుఖేష్ అరెస్ట్ సమయంలో బయటకి రావడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి.
ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా జాక్వలిన్ కి సుఖేష్ పరిచయమయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. జాక్వెలిన్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం వెల్ కమ్ టూ జంగిల్, ఫతే అనే చిత్రాల్లో నటిస్తుంది.ఈ రెండు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.