English | Telugu

స‌మంత స్నేహితుడికి ర‌ష్మిక గ్రీన్ సిగ్న‌ల్‌

ఒక వైపు సౌత్ సినిమాల‌తో పాటు బాలీవుడ్ మూవీస్‌,పాన్ ఇండియా చిత్రాల‌ను లైన్ పెడుతోన్న బ్యూటీ డాల్ ర‌ష్మిక మంద‌న్న‌. ఈ శాండిల్ వుడ్ క్యూట్ బేబీ రీసెంట్‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రెయిన్ బో అనే ఉమెన్ సెంట్రిక్ మూవీలో ఆమె న‌టిస్తోంది. ఇది కాకుండా మ‌రో మ‌హిళా ప్రాధాన్య‌తా చిత్రానికి ర‌ష్మిక ఓకే చెప్పిన‌ట్లు మీడియా స‌ర్కిల్స్ స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాను స‌మంత స్నేహితుడు తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇంత‌కీ ఆ స్నేహితుడు ఎవ‌రో కాదు.. రాహుల్ ర‌వీంద్ర‌న్‌. న‌టుడిగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈయ‌న చి.ల‌.సౌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌టంతో పాటు అవార్డును కూడా సాధించి పెట్టింది.

‘కాంతార2’ మూవీ క్రేజీ అప్‌డేట్స్‌

గ‌త ఏడాది ఎలాంటి అంచ‌నాలు లేకుండా మినిమం బ‌డ్జెట్‌తో రూపొంది ఏకంగా రూ. 450 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకునేలా చేసిన క‌న్న‌డ‌ సినిమా ‘కాంతార’. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతున్న సంగ‌తి విదిత‌మే. ‘కాంతార 2’ పేరుతో ఈ ప్రీక్వెల్‌ను రూపొందించ‌టానికి కావాల్సిన స‌న్నాహాల‌న్నీ జ‌రుగుతున్నాయి. రిష‌బ్ శెట్టి చాలా రోజుల నుంచి ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. న‌వంబ‌ర్ నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని శాండిల్ వుడ్ స‌ర్కిల్స్ అంటున్నారు. హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను ఏకంగా రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ప్రీక్వెల్‌ను నిర్మించ‌నుంది.

థాయ్‌లాండ్‌కి హీరో సూర్య‌

పాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా నెక్ట్స్ ఇయ‌ర్ కోసం ఎదురు చూస్తోన్న సినిమాల లిస్టులో కంగువా కూడా ఒక‌టి. ఇటు ద‌క్షిణాదితో పాటు అటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన వెర్స‌టైల్ హీరో సూర్య ఇంద‌లో క‌థానాయ‌కుడు. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా ప‌టాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ మూవీగా దీన్ని మేక‌ర్స్ రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా కంగువా సంద‌డి చేయ‌టానికి ఏకంగా ప‌ది భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం చెన్నైలో వేసిన భారీ సెట్స్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. దీని త‌ర్వాత ఓ భారీ షెడ్యూల్‌కు డైరెక్ట‌ర్ శివ అండ్ టీమ్ ప్లాన్ చేసింది.