English | Telugu
తన విడాకుల గురించి కలర్స్ స్వాతి ఏమందో తెలుసా?
Updated : Sep 26, 2023
స్వాతి అనే పేరు చెప్పగానే అందరికీ ఫ్లాష్ అవ్వకపోయినా, కలర్స్ స్వాతి అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే కలర్స్ అనే ప్రోగ్రామ్ అప్పట్లో అంత పాపులర్. ఆ పేరు వల్ల ఆ ప్రోగ్రామ్ పాపుల్ అవ్వలేదు. కేవలం స్వాతి వల్లే దానికి అంత పేరు వచ్చింది. ఆ ప్రోగ్రామ్‌లో తన మాటలతో, చలాకీతనంతో అందర్నీ ఆకట్టుకున్న స్వాతి ఆ తర్వాత సినిమాల్లోనూ తనదైన మార్క్‌తో అలరించింది. అయితే హీరోయిన్‌గా చేసిన సినిమాలు తక్కువే అయినా కొన్ని చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ చేసింది. 2018లో వికాస్ వాసు అనే వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. ఆ విధంగా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2021లో పంచతంత్రం అనే సినిమాతో మళ్ళీ టాలీవుడ్‌కు వచ్చింది స్వాతి. ప్రస్తుతం నవీన్‌చంద్రతో కలిసి ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమా చేస్తోంది. 2015లో వచ్చిన ‘త్రిపుర’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ‘మంత్ ఆఫ్ మధు’కి సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతి తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సరదాగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ‘మీరు విడాకులు తీసుకున్నారా?.. ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా?’ అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేనివ్వ...’ అంటూ తన స్టైల్‌లోనే సమాధానం చెప్పింది. ‘అంటే.. విడాకులు ఇవ్వనంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వనంటున్నారా?’ అంటూ క్లారిటీగా అడిగిన ప్రశ్నకు అంతే క్లారిటీగా ‘నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వను అంటున్నాను’ అని చెప్పింది.
స్వాతి ఈ సమాధానాన్ని ఎంతో సరదాగా చెప్పినప్పటికీ అదే ఇప్పుడు వైరల్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్వాతి, వికాస్ విడాకులు తీసుకున్నారనే రూమర్ వినిపిస్తోంది. విడిపోయారు కాబట్టే వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి స్వాతి తీసివేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే స్వాతి, వికాస్ విడాకుల విషయంలో ఇప్పటికీ క్లారిటీ అనేది లేదనేది వాస్తవం.