English | Telugu

అక్కడ షూటింగ్ చేస్తే సినిమా హిట్టే!

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఏ చిన్న విజయం లభించినా దానికి సెంటిమెంట్స్ ఆపాదించుకుని ఆ సెంటిమెంట్ ను అలాగే కొనసాగించటాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలా తరచుగా చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక షూటింగ్ స్పాట్ కు సంబంధించిన సెంటిమెంట్ ఒకటి బాగా పాపులర్ అయింది. అక్కడ షూటింగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఒకటి బలంగా వినిపిస్తుంది. ఇంతకీ సినిమా వాళ్లకు అంతగా అచ్చి వచ్చిన ఆ షూటింగ్ స్పాట్ ఏమిటి...? అంటే "ఆదిత్య రామ్ ఫిలిం సిటీ" అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.

ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకున్న అత్యంత భారీ చిత్రాలలో 90 శాతానికి పైగా సూపర్ హిట్ అయ్యాయి అనే టాక్ ఆఫ్ సెంటిమెంట్ ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఈ సెంటిమెంటుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ ' జైలర్ ', షారూక్ ఖాన్ జవాన్ చిత్రాల సక్సెస్.

జైలర్ చిత్రంలో రజనీకాంత్, తమన్నాల మీద చిత్రీకరించిన "నువ్వు కావాలయ్యా..." పాటతో పాటు చాలా కీలక సన్నివేశాలను ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లోనే షూట్ చేయడం జరిగింది. రోబో తర్వాత దశాబ్దన్నర కాలంగా హిట్ చూడని రజనీకాంత్ కు జైలర్ సక్సెస్ చాలా కీలకంగా మారింది. కాగా జైలర్ భారీ విజయంతో ఈ షూటింగ్ స్పాట్ సెంటిమెంట్ టాక్ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ అయింది.

ఆనాటి కమలహాసన్ దశావతారం మొదలుకొని నేటి రజనీ కాంత్ జైలర్, షారూక్ ఖాన్ ల జవాన్ తో పాటూ తేరి, మెర్సల్, 24 , ఆయిరత్తిల్ ఒరువన్, మావీరన్ వంటి సూపర్ హిట్ చిత్రాల షూటింగ్స్ ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లోనే జరగటం విశేషం. కాగా ప్రస్తుతం ఇద్దరు సూపర్ స్టార్స్ రజనీ కాంత్, షారూక్ ఖాన్ లు నటించిన రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కావటంతో "ఆదిత్యా రామ్ ఫిలిమ్ సిటీ" తమిళ ఇండస్ట్రీ కి పెద్ద సెంటిమెంటల్ స్పాట్ అయింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.