English | Telugu

సమయం లేదు మిత్రమా.. ఉన్నది ఐదు రోజులే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ ఒక్క పేరు చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షంతో తడిసి ముద్దవ్వడానికి. ఆయన నటించిన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ ఫాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు సైతం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుందంటేనే చాలు అభిమానులు ఆ సినిమా గురించి ఆరా తీస్తూ సినిమా కి సంబంధించిన అప్ డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అనే వార్త ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది.

పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్ కి ఉన్న పవర్ గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. వాళ్ళిద్దరి కలయిక లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆల్ సెంటర్స్ లో రికార్డు ల ఊచకోత కోసింది. మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తో సరి కొత్త రికార్డు లని సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఉస్తాద్ తిరిగి షూటింగ్ ని ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజులు పాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలని హరీష్ చిత్రీకరించబోతున్నాడు. ఆ సన్నివేశాలన్నీ సినిమా కి చాలా ముఖ్యమని చిత్రబృందం తెలియచేసింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తో పొత్తుని ప్రకటించి తన మలివిడత వారాహి యాత్ర ని రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి తన వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఒక పక్క సినిమా ఇంకో పక్క రాజకీయాల్లోనూ పవన్ ముందుకు దోసుకు పోతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ కి సంబంధించిన పంచ్ లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.