English | Telugu
'స్కంద' ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
Updated : Sep 29, 2023
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'స్కంద' మూవీ నిన్న(సెప్టెంబర్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మాస్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. రామ్, బోయపాటి కాంబోలో వచ్చిన మొదటి సినిమా కావడం, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండటంతో.. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.8.61 కోట్ల షేర్ తో 'ఇస్మార్ట్ శంకర్' టాప్ లో ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.10.57 కోట్ల షేర్ తో 'స్కంద' టాప్ ప్లేస్ లోకి వచ్చింది.
మొదటిరోజు నైజాంలో రూ.3.23 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.22 కోట్ల షేర్, ఆంధ్రలో రూ.4.17 కోట్ల షేర్ రాబట్టిన స్కంద.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.8.62 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.90 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.05 కోట్ల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ10.57 కోట్ల షేర్ సాధించింది.
రూ.46.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన స్కంద.. మొదటి రోజు దాదాపు 23 శాతం రికవర్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా దాదాపు రూ.36 షేర్ రాబట్టాల్సి ఉంది. శని, ఆది వారాల్లో ఇదే జోరు చూపించి ఫస్ట్ వీకెండ్ కి రూ.30-35కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలుంటాయి.
ఏరియాల వారిగా 'స్కంద' ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.3.23 కోట్ల షేర్
సీడెడ్: రూ.1.22 కోట్ల షేర్
ఆంధ్ర: రూ.4.17 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల మొదటి రోజు కలెక్షన్స్: రూ.8.62 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.90 లక్షల షేర్
ఓవర్సీస్: రూ.1.05 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్: రూ10.57 కోట్ల షేర్