English | Telugu

అభిమాని మృతి.. అతని కుటుంబానికి అండగా సూర్య!

హీరోలకు, అభిమానులకు మధ్య మంచి అనుబంధం, స్నేహ బంధం ఉంటుంది. అయితే అది కొందరు హీరోలకే వర్తిస్తుంది. అభిమానుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకుగానీ, విషాద ఘటనలకుగానీ హాజరై తమ అభిమానులకు అండగా ఉండే హీరోల్లో సూర్య ఒకరు. ఇటీవల తన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న సూర్య ఆ అభిమాని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

చెన్నయ్‌లోని ఎన్నూర్‌ వాసి అయిన అరవింద్‌ హీరో సూర్యకు వీరాభిమాని. ఇటీవల అరవింద్‌ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంటనే ఆ అభిమాని ఇంటికి వెళ్ళిన సూర్య అతని తల్లిదండ్రులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఆయా కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది 10 భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతోంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...