యష్ ప్లాన్ మిస్‌ఫైర్.. మందేసి చిందేసిన వేద
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారమవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్తగా మొదలైన ఈ సీరియల్ వారాలు గడిచే కొద్దీ వీవర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. అమ్మా - నాన్నా - ఓ పాప కథ అనే కాన్సెప్ట్ తో ఈ ముగ్గురి మధ్య పెనవేసిన బంధం కథగా ఈ సీరియల్ ఆత్యంతం ఆసక్తికరంగా సాగూతూ ఆకట్టుకుంటోంది. ఇందులో నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, ప్రణయ్ హనుమండ్ల, మిన్ను నైనిక నటించారు.