English | Telugu

పూర్ణ బుగ్గ కొరికిన సుధీర్‌.. వార్నింగ్ ఇచ్చిన‌ ర‌ష్మీ

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం లో చోటు ద‌గ్గ‌ర‌డంతో గుడ్ బై చెప్పేసిన విష‌యం తెలిసిందే. వెళ్లిపోతున్న స‌మ‌యంలో రోజా ఎమోష‌న‌ల్ అయింది కూడా. అయితే ఆమె స్థానంలో ఎవ‌రు వ‌స్తారు? .. ఎలా వుండ‌బోతోంది షో అన్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అంతా ఊహించిన‌ట్టుగానే ఈ షోలోకి పూర్ణ ఎంట్రీ ఇచ్చేసింది. వ‌చ్చి రాగానే ర‌ష్మీ గౌత‌మ్ కు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. కొత్త జ‌డ్జిగా రోజా స్థానంలో పూర్ణ ఎంట్రీ ఇవ్వ‌డంతో టీమ్ లీడ‌ర్లు రెచ్చిపోయారు. ముందు ఇమ్మానుయేల్ ముద్దు అడిగాడు.

స్కిట్ అనంత‌రం ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టేసి కొత్త ర‌చ్చ‌కు తెర‌లేపింది. ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టే స‌మ‌యంలో వ‌ర్ష ఫీలైంది. ముద్దు పెట్టిన వెంట‌నే పూర్ణ .. ఇమ్మానుయేల్ విగ్గుని తొల‌గించేసింది. దీంతో వ‌ర్ష న‌వ్వుల్లో మునిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సుడిగాలి సుధీర్‌.. ఓ కొంటె కోరిక కోరాడు. 'గ‌తంలో మీరు ఎంతో మందికి అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌డు నేను హీరోని కూడా. నాకు మీ బుగ్గ కొరికే అవ‌కాశం ఇవ్వండి' అంటూ ఠ‌క్కున అడిగేశాడు.

వెంట‌నే `ఏంటీ సుధీర్ మీకు నా బుగ్గ కొర‌కాల‌ని వుందా?' అంటూ పూర్ణ అడిగింది. దానికి సుధీర్ అవున‌ని స‌మాధానం చెప్పాడు. వెంట‌నే 'అయితే రండి' అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది పూర్ణ‌. త‌ను అలా అన్న వెంట‌నే సుధీర్ .. పూర్ణ ద‌గ్గ‌ర వాలిపోయాడు.. ఇది గ‌మ‌నించిన ర‌ష్మీ ఒక్క‌సారిగా షాక్ అయి పూర్ణ‌కు వార్నింగ్ ఇచ్చింది. "పూర్ణ గారు మీరు ఇలా చేయ‌డానికి వీళ్లేదు. దీనికి నేను ఒప్పుకోను" అంటూనే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఆ త‌రువాత సుధీర్ ని చూసి త‌ల కింద‌కి దించి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో ఏం జ‌రిగిందో తెలియాలంటే శుక్ర‌వారం ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.