యష్ - వేదల మధ్య చిత్ర ప్రేమ రగడ
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ సూపర్ హిట్ సీరియల్ `యోహే మొహబ్బతే` ఆధారంగా ఈ ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించగా కీలక పాత్రల్లో బేబీ మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, రాజా శ్రీధర్, బెంగళూరు పద్మ, అనంద్, మీనాక్షి తదతరులు నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం.