English | Telugu

బిగ్ బాస్ నాన్ స్టాప్‌ :  స్విమ్మింగ్ పూల్ లో రికార్డింగ్ డాన్స్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో 19వ రోజు మ‌రింత ప‌రాకాష్ట‌కు చేసింది. ఓ విధంగా ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.ఈ రోజుని నీ క‌న్ను నీలి స‌ముద్రం అంటూ సాగే హుషారైన పాట‌తో ప్రారంభించారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ టాస్క్ లో భాగంగా ఇంటి స‌భ్యులంతా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి డాన్స్ చేయాల్సి వుంటుందిని చెప్పారు. సాంగ్ కంప్లీట్ అయ్యే వ‌ర‌కు డాన్స్ చేస్తూనే వుండాలట‌.  చివ‌ర్లో ఇంటి స‌భ్యులంతా క‌లిసి స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశం. దీంతో ఒక్కొక్క‌రుగా స్విమ్మింగ్ పూల్ లో దిగి డాన్స్ లు చేశారు. ఈ క్ర‌మంలో హౌస్ లో వున్న భామ‌లంతా త‌మ బోల్డ్ అవ‌తార్ ని రంగంలోకి దింపేశారు.