English | Telugu

నో ఓటింగ్ .. వెళ్ల‌మంటే వెళ్లిపోవాల్సిందే - మ‌హేష్ విట్టా

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎలిమినేష‌న్ పై చాలా రోజులుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వీక్ష‌కుల ఓటింగ్ ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఇంటి స‌భ్యుల్లో నిర్వాహ‌కుల‌కు ఎవ‌రు న‌చ్చ‌డం లేదో వారిని మాత్ర‌మే ఎలిమినేట్ చేస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని తాజాగా మ‌హేష్ విట్టా వెల్ల‌డించి షాకిచ్చాడు. అనూహ్యంగా ఏడ‌వ వారం మ‌హేష్ విట్టా ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ ఓటీటీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన మ‌హేష్ విట్టా సంచ‌ల‌న‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్ట‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఎలిమినేష‌న్ గురించి మాకు ముందే హింట్ ఇచ్చేశారు. ఎవ‌రైనా ఎప్పుడైనా ఎలిమినేట్ కావొచ్చు అని బిగ్ బాస్ టీం వాళ్లు ముందే చెప్పారు. వీకెంట్ ఎలిమినేష‌న్ తో పాటు మిడ్ వీక్ ఎలిమినేష‌న్స్ కూడా ఉంటాయ‌ని చెప్పార‌ని, వాళ్ల ప్లాన్ లు ఎలా వున్నాయో తెలియ‌డం లేద‌న్నాడు. బిగ్‌బాస్ టీమ్ ఎవ‌రిని ఉంచాలంటే వాళ్ల‌ని ఉంచుతున్నారు. మ‌న చేతుల్లో కానీ, ఓటింగ్ వేసే ప్రేక్ష‌కుల చేతుల్లో కానీ ఏమీ లేద‌ని తేల్చి చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

`నాకు పీఆర్ టీమ్ ఏమీ లేదు. ఆ అవ‌స‌రం కూడా నాకు లేదు. షోలోకి వెళ్లే ముందు నా త‌మ్ముడికి ఫోన్ ఇచ్చి వెళ్లాను. వాడే అంతా చూసుకున్నాడు. పీఆర్ టీమ్ అనేది కొత్తగా వ‌చ్చేవాళ్ల‌కు.. అది నాకు అవ‌స‌రం లేదు. నేను ఏంటో అంద‌రికి తెలుసు. ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్లుగా వున్నాను. క‌ప్పుకొట్టాలి.. క‌సిగా ఆడి చివ‌రి వ‌ర‌కు ఉండాలి అంటే గేమ్ ఎలాగైనా ఆడొచ్చు. మ‌హేష్ విట్టా రియాలిటీ ఏంట‌న్న‌దే చూపించాల‌ని నేను హౌస్ లోకి వెళ్లాను. లాస్ట్ టైమ్ 12 వారాలు వుంటే ఈ సారి ఏడు వారాలే ఎక్కువ అనిపించింది. నేను పాపుల‌ర్ కావాల‌ని ఒక‌రిని బ్యాడ్ చేయాల‌నుకోలేదు` అని చెప్పుకొచ్చాడు మహేష్ విట్టా.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.