ఓజీ ఎఫెక్ట్.. ఇక నుండి తెలంగాణలో నో టికెట్ హైక్!
తెలంగాణలో 'ఓజీ' సినిమా టికెట్ రేట్ల పెంపు జీవోపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్టేను స్వాగతిస్తున్నానని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, అసలు 'ఓజీ' సినిమా రేట్ల పెంపు జీవో తనకు తెలియకుండా ఎలా ఇస్తారంటూ.. హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదని స్పష్టం చేశారు.